మెదడుకు మేత : ప్రశ్న 7


మెదడుకు మేత : ప్రశ్న 7

మీరు రెండు తలుపుల ముందు నిలబడి ఉన్నారు. ఒకటి స్వర్గానికి, మరొకటి నరకానికి దారితీస్తుంది. ప్రతి తలుపుకు ఒక సంరక్షకుడు ఉన్నాడు. వారిలో ఒకరు ఎప్పుడూ నిజం చెబుతారని, మరొకరు ఎప్పుడూ అబద్ధాలు చెబుతారని మీకు తెలుసు, కాని నిజం చెప్పేది ఎవరు, అబద్దం చెప్పేది ఎవరు అని మీకు తెలియదు. స్వర్గానికి మార్గం కనుగొనడానికి మీరు వారిలో ఒకరిని మాత్రమే ఒక ప్రశ్న అడగవచ్చు. ఆ ప్రశ్న ఏమిటి?



సమాధానం :
సమాధానం కొరకు ఈ క్రింది బటన్ ను నొక్కండి.

మీరు అడగవలసిన ప్రశ్న ఏమిటంటే, “ఒక సంరక్షకుడి దగ్గరకి వెళ్ళి, స్వర్గానికి ఏ వైపు దారితీస్తుందనే దాని గురించి నేను ఇంకొక సంరక్షకుడిని అడిగితే, అతను ఏమి సమాధానం ఇస్తాడు? అని అడగాలి”. మీరు ఈ ప్రశ్న ఎవరితో అడిగినా, మీరు ఎల్లప్పుడూ నరకానికి దారితీసే సమాధానం పొందుతారు. కాబట్టి మీరు స్వర్గానికి మీ ప్రయాణాన్ని కొనసాగించడానికి ఇతర మార్గాన్ని ఎంచుకోవచ్చు.
సమాధానం ఇంకా అర్ధంకాకపోతే ఇక్కడ వివరణ ఉంది.
ఎడమ తలుపు స్వర్గానికి దారితీస్తుందని అనుకుందాం.
ముందుగా కుడి తలుపు దగ్గర సంరక్షకుడు నిజం చెప్పేవాడని, మిగిలిన వాడు అబద్ధం చెప్పేవాడని అనుకుందాం.
ఇప్పుడు కుడి తలుపు దగ్గర సంరక్షకుడి వద్దకు వెళ్ళి "స్వర్గానికి ఏ వైపు దారితీస్తుందనే దాని గురించి నేను ఎడమ తలుపు దగ్గరి సంరక్షకుడిని అడిగితే, అతను ఏమి సమాధానం ఇస్తాడు?" అని అడగగానే అతను నిజం చెప్పాలి కాబట్టి ఇంకొక సంరక్షకుడు ఏం చెప్తాడో ఖచ్చితంగా అదే చెప్తాడు. ఇంకొక సంరక్షకుడు అబద్ధం చెప్పేవాడు కాబట్టి ఆ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా కుడి తలుపు అని చెప్తాడు. అంటే కుడి తలుపు నరకానికి దారితీస్తుందని అర్ధం.
అంటే ముందు మనం అనుకున్నట్టుగానే ఎడమ వై తలుపు స్వర్గానికి దారి తీస్తుందన్నమాట.
ఇదే విధంగా కుడి వైపు తలుపు దగ్గర ఉన్న సంరక్షకుడు అబద్ధం చెప్పి, ఎడమ వైపు తలుపు దగ్గర ఉన్న సంరక్షకుడు నిజం చెప్పినా మనకి దారి తెలిసిపోతుంది.
ఇదే విధంగా కుడి తలుపు స్వర్గానికి దారితీసినా మనకి తెలిసిపోతుంది.


సమాధానం అర్ధం కాని వారు కామెంట్ చెయ్యండి. అర్ధం అయినవారు అర్ధంకాని వారికి అర్ధం అయ్యేలా చెప్పండి.

మరిన్ని మెదడుకు మేత ప్రశ్నలు :

ఈ అమ్మాయి తన అన్నయ్యను ఎందుకు చంపిందో మీరు చెప్పగలరా ?

బంతిని ఎలా విసరాలో చెప్పండి చూద్దాం?

మూడు కేకులు మాత్రమే ఎలా వచ్చాయి ?

ఆ పెద్దాయన రాజకుమారులకు చెప్పిన చిట్కా ఏమై ఉంటుంది ?


పోలీసులు అతనిది ఆత్మహత్య కాదు హత్యే అని ఎలా చెప్పగలిగారు?



Post a Comment

1 Comments

  1. Ee rendu talupulalo nuv deniki samrakshakudivi ani adiginaa saripothundi
    Ans swargam talupune chupistaaru

    ReplyDelete