మెదడుకు మేత : ప్రశ్న 5




మెదడుకి మేత : ప్రశ్న 5

ఒక అమ్మాయి తన అమ్మమ్మ అంత్యక్రియలకు వెళ్తుంది. అక్కడ ఆమె ఒక అందమైన వ్యక్తిని చూస్తుంది. ఆమె అంత్యక్రియల్లో ఎక్కువ భాగం ధుఃఖిస్తున్న తన అన్నయ్యను, బంధువులను ఓదారుస్తూ ఉండడం వల్ల, అతని గురించి తెలుసుకోలేకపోతుంది. తరువాత, ఆమె అతన్ని వెతకడానికి వెళ్ళినప్పుడు, అతను అప్పటికే అక్కడనుంచి వెళ్ళిపోతాడు. అతని గురించి తెలుసుకోడానికి ఆమె చాలా రకాలుగా ప్రయత్నిస్తుంది. కానీ అతని పేరు తెలీదు, కనీసం ఫోటో కూడా లేకపోవడం వల్ల అతనెవరో కనుక్కోవడం ఆమె వల్ల కాలేదు. కొంత కాలం తరువాత, ఆమె తన అన్నయ్యను హత్య చేసింది. ఎందుకు?

సమాధానం :
సమాధానం కొరకు ఈ క్రింది బటన్ ను నొక్కండి.

అమ్మమ్మ అంత్యక్రియలకు వచ్చిన అతను తన కుటుంబానికి తెలిసిన వ్యక్తే అయ్యుంటాడు కాబట్టి, మళ్ళీ ఎవరైనా చనిపోతే తప్పకుండా వస్తాడని తన అన్నయ్యని చంపేస్తుంది.

ఇది ఒక ప్రత్యేకమైన ప్రశ్న. మనుషుల్లోని క్రూరత్వాన్ని, సైకోయిజంని బయటపెట్టడానికి ఈ ప్రశ్నని రూపొందించారు. ఈ ప్రశ్నకి ఎలాంటి సహాయం లేకుండా సమాధానం చెప్పేస్తే మీలో ఒక సైకో ఉన్నట్టు. కాబట్టి మీ ఫ్రెండ్స్ లో ఎవరు సైకోలో తెలుసుకోడానికి వాళ్ళకి షేర్ చెయ్యండి. 

సమాధానం అర్ధం కాని వారు కామెంట్ చెయ్యండి. అర్ధం అయినవారు అర్ధంకాని వారికి అర్ధం అయ్యేలా చెప్పండి.

Post a Comment

0 Comments