మెదడుకి మేత : ప్రశ్న 6




మెదడుకి మేత : ప్రశ్న 6
ఒక అపార్ట్మెంట్ లో ఆ అపార్ట్మెంట్ యజమాని కుర్చీలో చనిపోయి ఉన్నాడు. పోలీసులు వెళ్ళి చూసేసరికి అతని తలకి బుల్లెట్ గాయం ఉంది. కింద తుపాకీ పడి ఉంది. టేబుల్ మీద ఒక రికార్డింగ్ క్యాసెట్ కనిపించింది. ఆ క్యాసెట్ ను ఆన్ చెయ్యగానే ఒక రికార్డింగ్ వినిపించింది "నేను జీవితంలో చాలా పాపాలు చేసాను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను" అని. వెంటనే ఇది ఆత్మహత్య కాదు, హత్య అని పోలీసులు నిర్ధారించేసారు. ఎలా.??


సమాధానం :
సమాధానం కొరకు ఈ క్రింది బటన్ ను నొక్కండి.

చనిపోయిన వ్యక్తి రికార్డింగ్ టేపుని ఎలా రెవైండ్ చేస్తాడు.??


సమాధానం అర్ధం కాని వారు కామెంట్ చెయ్యండి. అర్ధం అయినవారు అర్ధంకాని వారికి అర్ధం అయ్యేలా చెప్పండి.


Post a Comment

0 Comments