ఒక రాజు తన ఇద్దరు కుమారులలో ఎవరికి పట్టాభిషేఖం చెయ్యాలో ఆలోచించి వారికి ఒక పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో ఇద్దరు కుమారులకు చెరొక గుర్రాన్ని ఇచ్చి 127 మైళ్ళ దూరంలో ఉన్న మరో ఊరికి వెళ్లాలని చెప్తాడు. ఎవరి గుర్రమైతే ఆ ఊరికి ముందు వెళ్తుందో వాళ్ళు ఓడిపోయినట్లు అని చెప్పి పంపించేస్తాడు.
మొదట వెళ్తే ఓడిపోతామని ఆ ఇద్దరు రాకుమారులు రోజుల తరబడి అటూ ఇటూ తిరుగుతూ ఉండిపోతారు. ఇక చేసేదేది లేక దారిలో ఒక పెద్దాయన్ని సలహా అడుగుతారు. ఆయన చెప్పిన మాట విని ఆ ఇద్దరు రాకుమారులు గుర్రాలని తీసుకుని వాయు వేగంతో దూసుకుని ఆ ఊరికి వెళ్ళిపోతారు. ఆ పెద్దాయన రాకుమారులకు ఏం చెప్పారు?
సమాధానం :
సమాధానం కొరకు ఈ క్రింది బటన్ ను నొక్కండి.
సమాధానం అర్ధం కానీ వారు కామెంట్ చెయ్యండి. అర్ధం అయినవారు అర్ధంకాని వారికీ అర్ధం అయ్యేలా చెప్పండి.
2 Comments
సమాధానం అర్ధం కాలేదు
ReplyDeleteఎవరి గుర్రం ముందు వెళ్తే వాళ్ళు ఓడిపోయినట్టు కదా...గుర్రాలు మార్చుకుంటే ఎవరు ముందు వెళ్తే పక్క వాడి గుర్రం గెలుస్తుంది....అర్ధం అయ్యిందా...
Delete