ఏ మందులూ, ఆపరేషన్ లేకుండానే టాన్సిల్స్ వాపు తగ్గాలంటే ఎలా.??


గొంతులో, గొంతుకు ఇరువైపుల పోలీసువారు మినిష్టరు గారి తలుపు కిరువైపులా కాపలా ఉన్నట్లుగా టాన్సిల్స్ (ఆరెలు) ఉంటాయి. అవి మన లోపలకు వెళ్ళే ఆహారములో, నీటిలో ఏమన్నా క్రిములు, బాక్టీరియాలు, టాక్సిన్స్, పాయిజన్ పదార్థాలు ఉంటే వాటిని శరీరం లోపలకు పోనివ్వకుండా అడ్డుకుని శరీరాన్ని రక్షించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి.
మనం తినే దాంట్లోగాని, త్రాగిన దాంట్లో గాని హాని కలిగించే బాక్టీరియాలు ఉన్నప్పుడు, ఆ బాక్టీరియాలను ఈ టాన్సిల్స్ ఆపడం వల్ల వీటికి ఇన్ఫెక్షన్ వచ్చి వాచిపోవడం, నొప్పి చేయడం, గొంతును మూసివేయడం, మ్రింగనివ్వక పోవడం జరుగుతుంది. తరచుగా ఈ ఇన్ ఫెక్షన్ వస్తూ ఉంటే వాటి బాధ తట్టుకోలేక ఆపరేషన్ చేయించి వాటిని పూర్తిగా తీయించుకుంటున్నారు.
కాపలా వాళ్ళను తీయించివేస్తే ఇంటికి నష్టమున్నట్లే శరీరానికి కూడా వాటిని తీయించుకుంటే ఇంకా సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఇవి ఎక్కువగా చల్లనివి, స్వీట్స్, ఐస్ క్రీములు, కూల్ డ్రింక్ లు, చాక్లెట్స్ మొదలగునవి ఎక్కువగా తినే పిల్లలకు వస్తూ ఉంటాయి.

చిట్కాలు:
  1. రోజంతా త్రాగే నీరు కాచి చల్లార్చి మరలా త్రాగే ముందు గోరువెచ్చగా పెట్టుకుని త్రాగాలి. నీటిని బాగా ఎక్కువగా త్రాగితే త్వరగా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.
  2. వేపపుల్ల నమిలి ఆ చేదు ఊసివేస్తూ ఉంటే, ఆ చేదుకు కొంత ఇన్ ఫెక్షన్ తగ్గుతుంది.
  3. గొంతు పైభాగాన రెండు పూటలా కొంచెం నూనె రాసి వేడి నీటి కాపడం పెట్టడం వల్ల నొప్పి తగ్గుతుంది.
  4. ఇన్ ఫెక్షన్ ఎక్కువగా ఉంటే 2, 3 రోజుల పాటు తేనె నీళ్ళతో పూర్తి ఉపవాసం ఉంటే చాలా బాగా తగ్గుతుంది.
  5. ఇన్ ఫెక్షన్ పూర్తిగా తగ్గేవరకు మధ్యాహ్నం వరకు ఏమీ తినకుండా ఉదయం నుండి తేనె నీళ్ళు, మంచి నీళ్ళ తోనే 2, 3 సార్లుగా త్రాగి ఉంటే మంచిది.
  6. మధ్యాహ్నం చప్పటి కూరలతో తేలిగ్గా తింటే మంచిది.
  7. సాయంకాలం ఉడికిన ఆహారం మాని 5, 6 గంటలకల్లా పండ్లను సరిపడా తిని ఆపివేయాలి. రాత్రికి ఆకలి వేస్తే తేనె నీళ్ళు త్రాగి పడుకోవచ్చు.
  8. పైన చెప్పినట్లు 6, 7 రోజులు చేస్తే ఏ మందులూ అవసరం లేకుండానే తగ్గిపోతుంది.
ఈ ఉపయోగకరమైన విషయాన్ని మీ ఆత్మీయులకి షేర్ చెయ్యండి.



Post a Comment

0 Comments