లాక్‌డౌన్‌తో ఇప్పుడు అందరూ ఇండోర్ గేమ్స్ ఆడడం మొదలు పెట్టారు. అష్టాచమ్మా, వైకుంఠపాళీ, లూడో లాంటి పాతకాలపు ఆటలను మళ్లీ ఇప్పుడు ఆడుతూ చక్కగా కాలక్షేపం చేస్తున్నారు. ఇక స్మార్ట్ ఫోన్ వదలలేని వాళ్లు గేమ్స్ కూడా ఫోన్‌లోనే ఆడుతున్నారు.
అయితే ఈ ఆన్‌లైన్ గేమ్స్ కాస్త గొడవలకు దారి తీస్తున్నాయి. లూడో గేమ్‌లో తనను తరచూ ఓడిస్తుందన్న కోపంతో భార్యను చితకబాదాడు ఓ భర్త. ఈ ఘటన గుజరాత్‌లోని వడోదరలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వడోదరకు చెందిన ఓ మహిళ ట్యూషన్ టీచర్‌గా పని చేస్తున్నారు. ఆమె భర్త ఓ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో పనిచేసేవాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో కాలక్షేపం కోసం భార్యాభర్తలు లూడో ఆడటం మొదలుపెట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వడోదరకు చెందిన ఓ మహిళ ట్యూషన్ టీచర్‌గా పని చేస్తున్నారు. ఆమె భర్త ఓ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో పనిచేసేవాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో కాలక్షేపం కోసం భార్యాభర్తలు లూడో ఆడటం మొదలుపెట్టారు.
వారితో పాటు కాలనీలోని మరికొంత మంది కూడా ఆన్‌లైన్‌లో లూడో గేమ్ ఆడారు. అయితే ప్రతిసారి ఆమె తన భర్తను ఓడించింది. దీంతో ఆగ్రహం చెందిన అతను.. ఆమెను దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డాడు. వెన్నుముకకు తీవ్ర గాయాలు కావడంతో బాధితురాలు ఆస్పత్రిపాలయ్యింది.
కాగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు. భర్తను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. భర్త క్షమాపణలు కోరడంతో ఆమె కేసు విత్‌డ్రా చేసుకుందని పోలీసులు పేర్కొన్నారు.
భార్య తనకంటే తెలివైందనే ఆత్మన్యూనతాభావానికి లోనై, ఈ క్రమంలో అహం దెబ్బతినడంతో అతను ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు స్థానికంగా ఓ కౌన్సెలర్ వివరించారు.
అందుకే దేనికైనా ఒక పరిమితి ఉండాలని అంటారు పెద్దలు. ఆడుకోండి కానీ తన్నుకునే లెవెల్ లో ఆడకండి. ఇంట్లోనే ఉంటున్నాం కదా అని వీర లెవెల్లో ఫోన్లో ఆటలు ఆడే వారికీ ఈ పోస్టును షేర్ చెయ్యండి.
0 Comments