ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధవిమాన ప్రాజెక్టుగా అమెరికా యుద్ధవిమానం ఎఫ్-35 ఘనత సాధించింది. మరి అంత ఖరీదైన యుద్ధవిమానంలో వినియోగించే హెల్మెట్ల ధరలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.
F -35 విమానం |
ఒక్కో యుద్ధవిమాన హెల్మెట్ ఖరీదు అక్షరాలా 4,00,000 అమెరికన్ డాలర్లు. దీనిని మన రూపాయల్లోకి మారిస్తే దాదాపు రూ.2.8కోట్లకు సమానం. ఈ ధరకు విలాసవంతమైన లాంబోర్గిని కారును కొనుక్కోవచ్చు.
ఒక హెల్మెట్ ధర ఎందుకింత ఎక్కువుగా ఉంది? అందులో అసలు ఏం ప్రత్యేకతలు ఉన్నాయి? తెలుసుకుందాం ఇవాళ్టి కొత్త విషయంలో.
2015లో అమెరికా ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ ఎ.వాల్ష్-III మాట్లాడుతూ ‘ఎఫ్-35 హెల్మెట్ కేవలం హెల్మెట్ కాదు అంతకంటే ఎక్కువే’ అని అన్నారు. దాని అర్థం ప్రపంచానికి ఇప్పుడు తెలిసింది.ఈ హెల్మెట్ల తయారీనే చాలా ప్రత్యేకంగా ఉంటుంది.
ముందుగా ఎఫ్-35 విమానం నడిపేందుకు ఎంపికైన పైలట్ శరీరాన్ని 3డీ స్కాన్ చేస్తారు. ఈ డేటాను నిపుణులకు పంపిస్తారు. వారు ప్రత్యేకమైన డిజైన్ సాఫ్ట్‌వేర్ వినియోగించి ఫోమ్‌లైనర్లను లేజర్ల సాయంతో కోస్తారు.
ప్యూపిలోమీటర్‌ను వినియోగించి పైలట్ల కనుపాపను స్కాన్ చేస్తారు. కనుపాపకు కేవలం రెండు మీల్లీమీటర్ల దూరంలోనే పైలట్లకు సమాచారం (లైవ్ ఫీడ్) కనిపించేలా ఏర్పాట్లు చేస్తారు.
ఎందుకంటే ఎఫ్-35 ఫైటర్ జెట్ విమానాలు అత్యంత వేగంగా అత్యధిక ఎత్తులో ప్రయాణిస్తాయి. అప్పుడు పైలట్ల శరీరంపై జీఫోర్స్(విపరీతమైన ఒత్తిడి)పడి వారి మెదడుపై ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలో వారు చూసేందుకు ఇబ్బంది పడకుండా ఇది ఉపయోగపడుతుంది.
అంతేకాదు విమానం కూలిపోయే సమయంలో ఎగ్జిట్ అయినా గాయపడకుండా పటిష్ఠమైన మెటీరియల్‌ను ఇందులో వాడారు. గన్ తో కాల్చినా ఈ హెల్మెట్‌కు ఏమీ కాదు. మెడకు గాయాలు కాకుండా రక్షణ ఏర్పాట్లు ఉన్నాయి.
సాధారణంగా జెట్ విమానాల్లో విపరీతమైన శబ్ధం వస్తుంది. ఈ శబ్ధం వల్ల పైలట్ల ఏకాగ్రత దెబ్బతినకుండా దీనిని సౌండ్‌ప్రూఫ్‌గా నిర్మించారు. ఇది శబ్దాలను గణనీయంగా తగ్గించేస్తుంది.
ఇందుకోసం స్పేషియల్ ఆడియో టెక్నాలజీని వినియోగించారు. దీంతో పైలెట్లకు చుట్టుపక్కల ఏం జరుగుతుందో స్పష్టమైన అవగాహన లభిస్తుంది. ఉదాహరణకు ఎడమ వైపు నుంచి ఏదైనా బాంబు గానీ, విమానం గానీ వస్తుంటే పైలెట్ హెల్మెట్‌లోని ఎడమవైపు నుంచి ఆడియో సంకేతాలు వస్తాయి.
చిమ్మ చీకట్లో కూడా చూడొచ్చు..
యుద్ధవిమానాల్లో దాడుల సమయంలో చీకటిపడితే పైలెట్లు ప్రత్యేకమైన నైట్ విజన్ గాగుల్స్ ధరించాల్సి ఉంటుంది. కానీ, ఈ హెల్మెట్ వినియోగించే పైలెట్‌కు ఆ అవసరం లేదు. దీనికి ఎక్స్‌రే విజన్ సౌకర్యాన్ని కల్పించారు.
దీంతోపాటు థర్మల్ విజన్ ఎఫెక్ట్ కూడా ఏర్పాటు చేశారు. హెల్మెట్ స్క్రీన్‌పై పిక్చర్ ఇన్ పిక్చర్ ఎఫెక్ట్ కూడా ఉంది. అంటే చిన్న చిన్న విండోస్ రూపంలో చాలా చిత్రాలను ఒకేసారి చూసే అవకాశం కల్పించారు.
ఈ విమానాలతో పాటు ప్రయాణించే డ్రోన్లు, ట్యాంకర్ విమానాలు, సహాయ విమానాల్లోని కెమేరాల నుంచి వచ్చే చిత్రాలను కూడా చూసే అవకాశం ఇందులో ఉంది.
ఎఫ్-35 యుద్ధవిమానానికి అన్ని వైపులా అమర్చిన ఆరు కెమెరాలను ఈ హెల్మెట్‌కు అనుసంధానించారు. దీంతో పైలట్ ఏ కెమెరా ఉన్న వైపు ఏం జరుగుతోందో తెలుసుకోవాలంటే తలను అటు తిప్పితే చాలు. ఆ కెమెరా అందించే దృశ్యాలను చూడవచ్చు. ఇదంతా పైలట్ నేరుగా అటు చూస్తున్న అనుభూతిని ఇస్తుంది.
అంతేకాదు విమానానికి సంబంధించిన కీలకమైన సమాచారం కూడా ఇందులో కనిపిస్తుంటుంది. నేలపై లక్ష్యాలకు సంబంధించిన సమాచారం కూడా పైలెట్లకు అందుబాటులోకి వచ్చేస్తుంది.
ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ హెల్మెట్ ధరించిన పైలెట్‌కు విమానంలో యద్ధక్షేత్రానికి వెళ్లినట్లు అనిపించదు. నేరుగా తానే అత్యుత్తమ సాంకేతికతతో కదనరంగంలోకి దిగి చూస్తున్నట్లు అనిపిస్తుంది.
ఈ అద్భుతమైన హెల్మెట్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చెయ్యండి. ఈ విషయాన్ని మీ మిత్రులతో షేర్ చెయ్యండి.
ఈ విమానాలతో పాటు ప్రయాణించే డ్రోన్లు, ట్యాంకర్ విమానాలు, సహాయ విమానాల్లోని కెమేరాల నుంచి వచ్చే చిత్రాలను కూడా చూసే అవకాశం ఇందులో ఉంది.
లక్ష్యం గురితప్పదు
పైలెట్లు తమ లక్ష్యాన్ని గుర్తించేందుకు గతంలో కాక్‌పీట్‌లో అటు ఇటు చూడాల్సి వచ్చేది. కానీ, కొత్త హెల్మెట్‌లో పైలెట్‌కు లక్ష్యానికి సంబంధించిన సమాచారం నిరంతరం అందుతూ ఉంటుంది. దీంతో పైలెట్ ఏకాగ్రత దెబ్బతినదు. ఈ హెల్మెట్‌కు ఫార్వర్డు లుకింగ్ ఇన్ఫ్రారెడ్ కెమెరాలు, సెర్చ్, ట్రాకింగ్ రాడార్‌ను కూడా అమర్చడం విశేషం.ఆరు వైపులు ఒకేసారి చూడొచ్చు

0 Comments