నా మూడ్ ఏమి బాగాలేక నేను బార్ కి వెళ్లి మందు గ్లాస్ ముందు వేసుకుని కూర్చున్నా. ఇంతలో ఒకతను బార్ లోకి వచ్చాడు. చూడడానికి పెద్ద దాదా లా ఉన్నాడు. అతన్ని చూసి అందరూ భయపడుతున్నారు. వాడు సరాసరి నా దగ్గరకి వచ్చి నా గ్లాసులో ఉన్న మందు కాస్తా తాగేసాడు.

తాగేసింది కాక వాడు నన్ను చూస్తూ " ఏంట్రా అలా చూస్తున్నావు, ఏం పీకుదామని?" అని నా ఎదురుగా వచ్చి కూర్చున్నాడు. నేను ఇక ఆపుకోలేక గట్టిగా ఏడ్చేసాను.

"అరేయ్ అరేయ్ ఏంట్రా ఏడుస్తావు, నాకు ఏడ్చే మగాళ్లంటే చెడ్డ చిరాకు" అని గట్టిగా అన్నాడు.

"ఏం చెప్పాలి భయ్యా నా జీవితం సంక నాకి పోయింది. ఇవాళ ఒక అర్జెంట్ మీటింగ్ ఉంటే దానికి లేట్ గా వెళ్ళాను. లేట్ గా వెళ్ళినందుకు మా బాస్ నన్ను ఉద్యోగంలోంచి తీసేసాడు. బయటకి వచ్చి చూస్తే పార్కింగ్ లో నా బైక్ లేదు, ఎవడో దొంగతనం చేసేసాడు. ఆ బైక్ కి ఇన్సూరెన్స్ లేదు. సరే కదా అని ఆటోలో ఇంటికి వచ్చా. తీరా చూసుకుంటే నా పర్సు ఆటోలో మర్చిపోయా. ఓరి దేవుడా ఏంటి ఈ కష్టాలు అని ఇంట్లోకి వెళ్తుంటే నా భార్య ఇంకొకడితో ఉంది. చీ దీనమ్మ జీవితం అనుకుంటూ ఈ బార్ కి వచ్చేసా. ఇక్కడ మందు గ్లాసులో విషం టాబ్లెట్ వేసుకుని అది కరిగే దాక ఆగుదాం అని ఎదురు చూస్తుంటే ఇంతలో నువ్వొచ్చి నా మందు కాస్తా తాగేసావ్. ఇంక నేను ఎలా సచ్చేది."