గురక బాధ కొందరికి ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే, భార్యాభర్తలు వేరు వేరు గదుల్లోకి వెళితేగాని పడుకోలేరు. బాగా లావుగా ఉండేవారికి, పొట్ట ఉన్న వారికి, తిని పడుకునే వారికి ఎక్కువగా గురక వచ్చే అవకాశముంటుంది.
లావున్న వారికి శరీరం లావుగా అయినందుకు కోటానుకోట్ల జీవకణాలు అదనంగా పెరుగుతాయి. అవన్నీ జీవించడానికి వారు పీల్చుకునే గాలి చాలదు. పగలు అయితే కదలికలు ఉండడం వల్ల ఎక్కువగా ఊపిరితిత్తులు అందించగలుగుతాయి.అదే నిద్రలో అయితే ఊపిరితిత్తులు తగ్గించి పనిచేస్తాయి. పైగా వీరు పొట్టనిండా తిని పడుకునేసరికి పొట్ట బరువు వెళ్ళి ఊపిరితిత్తులను 25, 30 శాతం మూసి మరీ గాలి అందకుండా చేసేస్తుంది.
దాంతో వారి శరీరానికి రెండు ముక్కుల ద్వారా వెళ్ళేది చాలక నోటితో కూడా పీల్చుకుని అందించే ప్రయత్నం చేస్తుంది. ఎక్కువ గాలి నోటిలో నుండి లోపలకు పోయే సరికి రకరకాల మోతలు వస్తూ ఉంటాయి.
చిట్కాలు:
- సాయంకాలం భోజనాన్ని వెలుతురుండగానే తినాలి. పడుకునే లోపు ఆహారం అరిగిపోయి పొట్ట ఖాళీగా ఉండాలి.
- సాయంకాలం ఆహారం మాత్రం ఉడికినవి మాని పండ్లు తిని సరిపడితే, వారి శరీరానికి ప్రాణ వాయువు అవసరాన్ని ఆ ఆహారం తగ్గించి, శ్వాసక్రియ సాఫీగా నడిచేట్లు చేస్తుంది.
- బరువును తగ్గించే ఆహారాన్ని తింటూ బరువును తగ్గించుకోవాలి. ఇలా తింటే 10, 15 రోజులలో గురక చాలా వరకు తగ్గుతుంది.

0 Comments