తుమ్మురావడం అనేది ఆరోగ్యానికి మంచిదే, కాని రోజుకు 50, 60 తుమ్ములు రావడం జబ్బు. ముక్కులో, ముక్కు పక్క సందులలో (సైనస్ లు) రొంప ఎక్కువగా పేరుకొని గాలి ప్రయాణానికి మరీ అడ్డుగా తయారవుతుంది. దీనిని కదిలించి బయటకు కారేటట్లు చేసి, గాలి ప్రయాణం సాఫీగా చేయడానికి శరీరం తుమ్మించి రొంపను కదుపుతూ వుంటుంది.
శరీరం మన గురించి ఆ చెడు తియ్యడానికి ప్రయత్నిస్తుంటే మనకేమో తుమ్మే ఓపిక లేక, లేదా అంత ఖాళీ లేక తుమ్ము రాకుండా మందు వేస్తాం. దాంతో తుమ్ములు తాత్కాలికంగా ఆగిపోతాయి. ఆ రొంప పేరుకుపోయి రకరకాల ఇన్ ఫెక్షన్స్ కలిగిస్తూ ఇక జీవితాంతం మనకు తుమ్ములు పోవు, మందులూ పోవు. కొందరికి మంచు తగిలితే తుమ్ములు వస్తే మరి కొందరికి దుమ్ము తగిలితే తుమ్ములొస్తాయి. కొందరికి అగరొత్తుల పొగకు, పోపు వాసనకు ఇలా రకరకాలుగా వస్తుంటాయి. వీటిని పూర్తిగా 20, 30 రోజులలో పోగొట్టుకోవచ్చును.
చిట్కాలు:
- మంచి నీళ్ళు తక్కువగా త్రాగేవారికి ఈ జబ్బు ఎక్కువగా వుంటుంది. కాబట్టి రోజుకు అయిదు లీటర్ల నీటిని గోరు వెచ్చగా చేసుకొని త్రాగాలి. చల్లదనం అసలు పనికిరాదు.
- ఉదయం పూట స్పీడు వాకింగ్ కాని లేదా జాగింగ్ (అలుపు రాని పరుగు) గాని మీ వయసును బట్టి ఏది కుదిరితే అది 40, 50 నిమిషాల పాటు చేయండి. ఇవి చేసేటప్పుడు మాట్లాడకుండా మనసును శ్వాస మీద పెట్టి దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ చేయాలి. రెక్కలను బాగా కదుపుతూ చేయాలి. దీని వల్ల రొంపలు ఆవిరైపోతాయి.
- దీర్ఘ శ్వాసల ప్రాణాయామాన్ని (మెల్లగా గాలి పీల్చే రకాలు కాదు) చేయాలి. ముక్కులో రొంప లేనప్పటి నుండి ప్రారంభించాలి. రొంప కొద్దిగా ఉంటే పైన చెప్పిన వ్యాయామాలే కొన్ని రోజుల వరకు చేయండి.
- ప్రతి రోజూ ముఖానికి ఏదన్నా నూనె వ్రాసుకొని 10 నిమిషాల పాటు నీటి ఆవిరి పట్టుకుంటే మంచిది. కావాలంటే రెండు పూటలా ఆవిరి పట్టుకోవచ్చు. నీటిలో ఏమీ కలపనవసరం లేదు.
- పంచదార, స్వీట్స్, ఫ్రిజ్ లోనివి, కూల్ డ్రింక్స్ లాంటి వాటికి దూరంగా ఉండాలి.
- 70, 80 శాతం మందికి పైన చెప్పిన చిట్కాలకే తగ్గుతాయి. ఎవరికన్నా ఇంకా పూర్తిగా తగ్గనప్పుడు ఇక ఆహారంలో మేము చెప్పినట్లుగా పూర్తిగా ఉప్పు లేకుండా తింటే గాని సాంతం తగ్గడం లేదు.
- తుమ్ములకు వేసుకునే మందులన్నింటినీ పూర్తిగా ఆపు చేయాలి.

0 Comments