మెన్సస్ లు నెల నెలా టైం ప్రకారం వస్తూ రక్తస్రావం మాత్రం 8, 10 రోజుల వరకూ అవుతూ ఉంటుంది. ఈ సమస్య రక్తహీనత ఎక్కువగా ఉన్నవారిలో, మానసికమైన వత్తిడి ఎక్కువగా ఉన్నవారిలో తరచుగా వస్తూ ఉంటుంది.


కొందరికి గర్భకోశానికి కంతులు (ఫైబ్రాయిడ్స్) ఉండి బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది. మరికొందరిలో ఎండోక్రైన్ గ్రంధులు సరిగా పని చేయకపోవడం వలన కూడా రావచ్చు.
చిట్కాలు:
  1. బ్లీడింగ్ అయ్యే రోజులలో ఐస్ ను ముక్కలుగా చేసి దానిని గుడ్డలో పేర్చి, ఆ గుడ్డను పొత్తికడుపు భాగం అంతా పరిస్తే మంచిది. అలా 15, 20 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. (మధ్యలో గుడ్డను త్రిప్పితే సరిపోతుంది) ఆ చల్లదనాన్ని తట్టుకోవడానికి రక్తప్రసరణలో మార్పు రావడం వల్ల బ్లీడింగ్ తగ్గుతుంది. ఇలా 3, 4 సార్లు వేసుకోవచ్చు.
  2. ప్రతిరోజు 1, 2 నెలల పాటు తొట్టి స్నానం చేస్తే పూర్తిగా తగ్గుతుంది. ప్లాస్టిక్ తొట్టిగాని, సిమెంటు తొట్టిగాని (2 అడుగుల ఎత్తు, 3 అడుగుల వైశాల్యం) ఉంటే అందులో నీళ్ళు పోసి పిర్రలు ఆనించి కూర్చుని కాళ్ళను బయటకు వ్రేలాడేసి ఉంచాలి. ఆ నీళ్ళలో మీ పొత్తి కడుపు భాగం నుండి తొడల వరకు ఉండి మిగతా భాగం తడవకుండా ఉంటుంది. ఇలా 20 నిమిషాల పాటు ఉండి తరువాత లేవొచ్చు. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడే తొట్టి స్నానం చేయాలి.
  3. రక్తం బాగా పట్టే ఆహార నియమాలు ఆచరిస్తే మంచిది. ఇలా 2, 3 నెలలు ప్రయత్నించినా తగ్గక పోతే వైద్యుని సంప్రదించడం మంచిది.
ఈ ఉపయోగకరమైన విషయాన్ని మీ ఆత్మీయులకి షేర్ చెయ్యండి.