ఎక్కువ మందిలో తరచూ తల నొప్పి వస్తూ ఉంటుంది. అందరూ నొప్పిని తగ్గించుకునే మాత్రను వేసికొని, నొప్పికి అసలు కారణాలను తగ్గించుకోరు. అందుచేతనే, సంవత్సరాలు తరిగినా తలనొప్పి మాత్రం పోదు.
తలనొప్పి రావడానికి 10, 12 కారణాలు ఉన్నాయి. అందరిలోనూ ఒకే కారణాల చేత రాదు. ఒక్కొక్కరి తలనొప్పికి వేరు వేరు కారణాలు కలిసి ఉండి కూడా వస్తుంది. కారణాలు చూస్తే, టీ, కాఫీ లు బాగా త్రాగడం వల్ల, మంచి నీరు తక్కువగా త్రాగడం వల్ల, మలబద్ధకం వల్ల, గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ఉన్నందువల్ల, జీర్ణక్రియ సరిగా లేనందువల్ల, ఎప్పుడూ ముక్కు రొంపలుండడం వల్ల, మెడ నొప్పిగా ఉన్నా, రక్తం తక్కువగా ఉన్నా, రక్తనాళాలు తలలో సన్నగిల్లినా, కంటి చూపు సరిగా లేకపోయినా మొదలగునవి ముఖ్యం అని చెప్పవచ్చు. మనం చేసే వైద్యం ఈ కారణాలను తొలగిస్తే పూర్తిగా తలనొప్పి తగ్గిపోతుంది.
చిట్కాలు:
  1. ప్రతిరోజూ మంచి నీరును 5 లీటర్లు తప్పనిసరిగా త్రాగాలి.
  2. రోజూ సుఖంగా 2, 3 సార్లు విరేచనం అయ్యేట్లు చూడండి.
  3. ప్రతి రోజూ తప్పనిసరిగా తలస్నానం చల్లని నీటితో చేయండి. 2, 3 రోజులు తలనొప్పి ఎక్కువైనా అలవాటులో తగ్గిపోతుంది. తల స్నానం వల్ల తలకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. తలలో వేడి కూడా తగ్గుతుంది.
  4. ఉదయం టీ, కాఫీలను పూర్తిగా మాని తేనె నీళ్ళను గాని, పచ్చి కూరల రసాన్ని గాని, పండ్ల రసాన్ని గాని త్రాగండి.
  5. టిఫిన్ క్రింద కేవలం మొలకలు, లేదా పండ్లను తింటే జీర్ణకోశం బాగుపడుతుంది.
  6. తలనొప్పిగా ఉన్నప్పుడు పాదాలు రెండూ వేడి నీటిలో పెట్టి, తలపై తడిగుడ్డ (మాడుపై) పెట్టుకుని అలా 15 నిమిషాలు పాటు కూర్చుంటే త్వరగా ఉపశమనం వస్తుంది.
  7. ఇలా చేసినా తలనొప్పి తట్టుకోలేకుండా వస్తే అప్పుడు పూర్వంలా మందు వాడుకోవచ్చు. 8, 10 రోజులలో వాటి అవసరం లేకుండానే మార్పు వస్తుంది.
ఈ ఉపయోగకరమైన విషయాన్ని మీ ఆత్మీయులకి షేర్ చెయ్యండి.