అన్నీ ఉన్నవారికి జుట్టు సరిగా ఉండదు. అడుక్కునే వారికి ఏమీ లేక పోయినా బోలెడు బొచ్చు మాత్రం ఉంటుంది. పుర్వీకులకు జుట్టు బాగా వత్తుగా, ఎక్కువ పొడవుగా ఉండేది. మన అలవాట్లు జుట్టు ఊడిపోయేట్లు చేస్తున్నాయి.
చిట్కాలు:
  1. ప్రతి రోజూ చన్నీటి తల స్నానం చేయండి. జుట్టు కుదుళ్ళు గట్టి పడతాయి. వేడి నీరు ఎక్కువగా తలకు పోయడం వల్ల జుట్టు కుదుళ్ళు ఆ వేడికి దెబ్బతిని జుట్టు ఎక్కువగా ఊడి పోతుంది.
  2. షాంపూలు మాని 7, 8 రోజులు కుంకుడికాయ రసంతో తలంటుకోండి. షాంపూలలో ఉండే మందులు జుట్టును చిట్లినట్లు చేస్తాయి.
  3. తల ఆరాక కొబ్బరి నూనె రాస్తే, ఎండ జుట్టును, కుదుళ్ళను పాడు చేయకుండా కాపాడుతుంది.
  4. రోజుకి 100 వెంట్రుకలు ఊడడం 100 వెంట్రుకలు తిరిగి పుట్టడం ఆరోగ్య లక్షణం. అందరికీ 100 ఊడుతున్నాయి కాని తిరిగి పుట్టడం లేదు. జుట్టు తిరిగి పుట్టాలంటే మధ్యాహ్నం భోజనంలో ఆకుకూరలను వండుకుని బాగా ఎక్కువగా తినడం మంచిది.
  5. మాంసకృత్తుల ఆహారం జుట్టు పుట్టడానికి, బాగా ఎదగడానికి మంచిది. కాబట్టి మొలకెత్తిన విత్తనాలు ఉదయం తప్పని సరిగా తినండి. అందులో కొబ్బరి, వేరు శెనగ పప్పులు కూడా తప్పని సరిగా తింటే మంచిది.
ఈ ఉపయోగకరమైన విషయాన్ని మీ ఆత్మీయులకి షేర్ చెయ్యండి.