కొందరికి గ్యాసు పొత్తి కడుపు భాగంలో బిగపట్టి బయటకు రాదు. ఏమి చేయాలో తోచని ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అపానవాయువు వస్తే బాగుంటుందనిపిస్తుంది. అది ఎదురుచూడగా చూడగా ఎప్పటికో ఎన్నో ప్రయత్నాలు చేయగా గాని బయటకు రాదు. అది బయటకు వస్తే ప్రాణం హాయిగా ఉంటుంది.


అలా గ్యాసు బిగయడానికి కారణాలు చూస్తే మూత్రాన్ని ఎక్కువ సేపు (మూత్రం సంచి నిండేదాకా) ఆపుకోవడం, నడుముకు బట్టలను టైటుగా బిగించడం, మలద్వారం దాకా మలం వచ్చి అక్కడ బిగిసిపోవడం మొదలగునవి. అలాగే ఛాతీ భాగంలో, పొట్ట భాగంలో గ్యాసు త్రేన్పు రూపంలో రాకుండా పట్టేస్తుంది. త్రేన్చుదామనుకున్నా త్రేన్పు రాదు. ఇలా గ్యాసు పట్టినప్పుడు ఆ గ్యాసు ఫ్రీగా బయటకు రావాలంటే.
చిట్కాలు:
  1. ముందు బెల్టు, బట్టలు కాస్త వదులు చేసుకోవడం మంచిది.
  2. మూత్రం రాకపోయినా వెళ్ళి కూర్చుంటే అప్పుడు కొంత గ్యాసు ఆ టైంలో బాగా కదిలి బయటకు పోతుంది.
  3. పై భాగంలో గ్యాసు పడితే వజ్రాసనం (నడుము లైనుగా పెట్టి ఎలా కూర్చున్నా ఫరవాలేదు) లో కూర్చుంటే గ్యాసు రిలీజు అవుతుంది.
  4. ఇంకా బిగపట్టి ఉంటే 5, 10 సార్లు శ్వాసలను గట్టిగా పీల్చివదిలితే, ఆ కదలికలకు గ్యాసు బయటకు వస్తుంది.
  5. ఇంకా రాకపోతే, వేడినీటిని కాఫీ లాగా మెల్లగా త్రాగితే ప్రేగులలో ఆ వేడి కదలికలను పెంచి గ్యాసు బయటకు వస్తుంది.
  6. ఇంకా ఇబ్బంది ఉంటే ఛాతీపై గాని బొడ్డు క్రింద గాని కొంచెం నూనె రాసి వేడినీటి కాపడం పెడితే చాలా వరకు వచ్చేస్తుంది. ఇంకా ఇబ్బంది ఉంటే వైద్యుల సలహాపై ఏదన్నా మందు వాడుకోవచ్చు. పైన చెప్పిన వాటిలో మీకాసమయంలో ఏది అవకాశముంటే దానిని చేసి చూడండి.
ఈ ఉపయోగకరమైన విషయాన్ని మీ ఆత్మీయులకి షేర్ చెయ్యండి.