విరిగిన ఎముకలు త్వరగా అతకాలంటే మీరు పాటించాల్సిన జాగ్రత్తలు.


ఎముక త్వరగా అతకాలన్నా, అక్కడ కండ త్వరగా పట్టాలన్నా మాంసం, గ్రుడ్లు, కైమా, బోను సూప్ లను బాగా వాడితే త్వరగా అతుకుతాయని అందరూ తినమని సలహా ఇస్తారు. ఇంట్లో ఆడవారికి మగవారు మంచంపై ఉంటే, అదే పనిగా రకరకాలు వండి పెడుతుంటారు.
ఖాళీగా పడుకుని ఇలాంటి చెత్తంతా తినేసరికి, వారిలో ఉన్న శక్తి అంతా ఎప్పుడూ జీర్ణకోశము వద్దే వుండి వీటిని అరిగించే పనికే సరిపోతుంది. ఇక ఎముకలు అతికించే శక్తి లేక ఆ పని ఆలస్యంగా చేస్తుంది. చివరకు మనకు వచ్చేది 10, 15 కిలోల బరువు, విరిగిన దగ్గర వాపులు. అతకడానికి 3, 4 నెలలు పైన బడుతుంది. జంతువులు ఎముకలు విరిగినప్పుడు 8, 10 రోజులు పూర్తిగా ఉపవాసంలో ఉండి వాటిలో ఉన్న శక్తినంతా అతకడానికే వాడుకుంటాయి. అందుకే వాటికి చాలా త్వరగా అతుకుతాయి.
చిట్కాలు:
  1. మాంసాహారం, గ్రుడ్లు పూర్తిగా మాని, మొలకెత్తిన విత్తనాలు, పచ్చి కొబ్బరిని సరిపడనంత పెట్టుకుని ఉదయం టిఫిన్ గా తింటే సరిపోతుంది. వీటితో పాటు నువ్వుల ఉండ ఒకటి తినాలి.
  2. మధ్యాహ్నం బరువు పెరగకుండా రొట్టి, కూరలు తింటే సరిపోతుంది
  3. సాయంకాలం పళ్ళరసాలు, పండ్లు, '6' గంటలకల్లా తిని ఆపాలి. రాత్రికి ఏమీ తినకుండా ఆపితే శరీరం ఆ టైములో బాగా ఎముకలను అంటించుకునే ప్రయత్నం చేస్తుంది.
  4. రోజుకి 1, 2 తమలపాకులను భోజనం తిన్నాక నమలడం మంచిది. కాల్షియం ఇందులో బాగా ఉంటుంది.
ఈ ఉపయోగకరమైన విషయాన్ని మీ ఆత్మీయులకి షేర్ చెయ్యండి.

Post a Comment

0 Comments