నీళ్ళు మారితే వచ్చిందని, ఊరు మారితే వచ్చిందని కొందరు వాటిపై నిందలు వేస్తూ ఉంటారు తప్ప వారిపై వారు ఎప్పుడూ వేసుకోరు. తప్పు మనలో పెట్టుకున్నంత కాలం కాచిన నీరు త్రాగినా ఎమీబియాసిస్ పోదు. జంతువులు ఏ నీరు పడితే ఆ నీరును, పచ్చటి నీటిని త్రాగినా వాటికి ఎమీబియాసిస్, నులి పురుగులు లాంటివి రావు. ఆ క్రిముల నుండి రక్షించే శక్తి, చంపేశక్తి వాటి ప్రేగులలో బలంగా ఉంది.
మనకు ఆ శక్తి తప్ప అన్నీ ఉంటాయి. విరేచన బద్ధకం ఉన్నవారికి ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. నిల్వ ఉన్న మలంలో అనేక రకాల క్రిములు పుట్టి ప్రేగుల ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ఆ చెడ్డక్రిములు పెరగడం వల్ల ప్రేగులలో మంచి క్రిములు తగ్గిపోతాయి. ఎవరి ప్రేగులలో రక్షించే సూక్ష్మ జీవులు తగ్గిపోతాయో, వాళ్ళ ప్రేగులలో ఎమీబాలు గోడలకు పేరుకుని పిల్లలను అభివృద్ధి చేస్తూ ఉంటాయి.
చిట్కాలు:
  1. 2, 3 రోజుల పాటు ఉదయం పూట గోరువెచ్చని నీటితో ఎనిమా (Enema) చేసుకోవాలి.
  2. ఆ తరువాత ఒక రోజు ఆ గోరువెచ్చని నీటిలో నిమ్మరసాన్ని (ఒక పెద్దకాయను గింజలు, తుక్కుపడకుండా) పిండి ఆ నీటితో ఎనిమా చేసుకోవాలి.
  3. ఎనిమా నీటిని ఒక డబ్బా ఎక్కిస్తే చాలవు. కాబట్టి ప్రేగుల అంచులను క్లీన్ చేయాలంటే ప్రతిరోజూ ఒక డబ్బా నీరు ఎక్కాక మరలా వెంటనే ఇంకొక డబ్బా నీరు కూడా ఎక్కించగలిగితే మంచిది.
  4. నాల్గవ రోజు నుండి, ఎనిమా డబ్బాలో వేపాకు నీటిని పోసి (దోసెడు వేప ఆకును 2 లీటర్ల నీటిలో వేసి మరిగించి, చల్లార్చి, వాటిని వడకట్టి, ఆ ఆకుపచ్చ నీటిని) ఆ నీటితో ఎనిమా చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు 3, 4 రోజుల పాటు వేప నీటి ఎనిమా వల్ల ప్రేగులలో గోడలకు పట్టిన ఎమీబియాసిస్, నులిపురుగులు ఆ చేదుకు బయటకు కొట్టుకొస్తాయి.
  5. వేప నీరు 4 రోజులు ఎనిమాలో వాడాక 2, 3 రోజులు మామూలు గోరు వెచ్చని నీరుతో ఎనిమా చేసి ఆపితే సరిపోతుంది.
  6. ప్రేగులలో మనల్ని రక్షించే ఉపయోగపడే సుక్ష్మజీవులు త్వరగా తయారవడానికి ఉదయం టిఫిన్ క్రింద పెరుగన్నాన్ని మాత్రమే (రాత్రి అన్నములో ముడి బియ్యం అయితే మంచిది, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పాలు పోసి తోడుపెట్టుకుని అలా ఉంచి) తింటే మంచిది. ఆ అన్నంలో ఉపయోగపడే సూక్ష్మజీవులు పెరుగుతాయి.
  7. మధ్యాహ్నం, సాయంకాలం మాత్రం మలబద్ధకం రాకుండా జాగ్రత్తగా ఆహారనియమాలు పాటించాలి.
  8. ఇంకా ఎమీబియాసిస్ పోనట్లు అనిపిస్తే 20, 25 రోజుల తరువాత మరలా వేప నీటి ఎనిమా 4, 5 రోజులు వరసనే చేసి ఆపితే సరిపోతుంది.
ఈ ఉపయోగకరమైన విషయాన్ని మీ ఆత్మీయులకి షేర్ చెయ్యండి.