ఇద్దరు వ్యాపారవేత్తలు లండన్ లోని ఒక షాపింగ్ మాల్ లో కొద్ది రోజుల్లో ప్రారంభోత్సవానికి రెడీగా ఉన్న షాపులో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. మధ్యాహ్న సమయం అవుతుండడం వల్ల షాపులో పని చేసే వాళ్ళు బయటకి వెళ్లారు. వీళ్ళు ఇద్దరు మాత్రమే ఉన్నారు. వీళ్ళూ భోజనం చేయడానికని ఎదురు చూస్తున్నారు.
ఇంతలో ఆ ఇద్దరిలో ఒకతను “ఇంకాసేపటిలో మన షాపులోకి ఎవరో ఒకరు వచ్చి ఏం అమ్ముతున్నారు మీరు అని
అడుగుతారు చూడండి” అని రెండో వ్యక్తితో అన్నాడు.
అతను ఆలా అన్నాడో లేదో నిజంగానే ఒక ముసలావిడ షాపులోకి తొంగి చూసి “బాబూ ఇక్కడ మీరు ఏం అమ్ముతూ ఉంటారు” అని అడిగింది.
ఆ ఇద్దరు యువకులు ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. అందులో ఒకడు ఆ
ముసలావిడని ఆట పట్టించడానికి ఇలా అన్నాడు “బామ్మ గారూ ఇక్కడ పిచ్చి పట్టిన వాళ్ళని అమ్ముతుంటాం మీకూ కావాలా ?” అన్నాడు.
అవాక్కైన బామ్మ గారు ఓరి పిల్ల వెధవల్లారా నా దగ్గరా మీ వేషాలు అని మనసులో
అనుకుని “ఓహ్ అవునా బాబూ, మంచి వ్యాపారం, బాగా నడుస్తున్నట్టు ఉందిగా ఇంకా ఇద్దరే మిగిలారు అమ్మడానికి” అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.
