యెంకట్రావ్ అమెరికా వెళ్ళి ఒక కుక్కని కొనుక్కొచ్చాడు..

దాని స్పెషాలిటీ ఏంటంటే, వాసన చూసి, తన యజమాని రక్త  సంబందీకులని గుర్తు పట్టేస్తుంది....

దాన్ని తీసుకు రాగానే, మనోడు దానికి ఆర్డర్ ఇచ్చాడు..." పో.. స్కూల్ కి వెళ్ళి, నా ఇద్దరు పిల్లల్ని తీసుకుని రా......"

అది చాలాసేపటి వరకు వెనక్కి రాలేదు.....

అది చూసి, వాళ్ళావిడ గొడవ మొదలెట్టింది....

ఒక గంట తర్వాత, అది అయిదుగురు పిల్లల్ని వెంట తీసుకు వచ్చింది...

అందులో ఇద్దరు పనిమనిషి పిల్లలు...ఇద్దరు పక్కింటి వాళ్ళ పిల్లలు...ఒకడు సెక్రెటరీ కొడుకు.....

వెంటనే వాళ్ళావిడ చీపురు కట్ట పట్టుకుంది....

" అంటే, వీళ్ళందరూ నీకు పుట్టిన వాళ్ళేనా? "

యెంకట్రావ్ : ఆ విషయం తర్వాత చెబుతా కానీ, ఇది మన ఇద్దరు పిల్లల్ని తీసుకు రాలేదు... ముందు దానికి సమాధానం చెప్పు.....

----x---x----x---x----

మీ స్నేహితులతో ఈ జోక్ షేర్ చేయడం మర్చిపోకండి మరీ.