ఒక రోజు నేను నా పెళ్ళాం కలిసి ఇంట్లోకి సామాన్లు తీసుకురావడానికి సూపర్ మార్కెట్ కి వెళ్ళాం. అది చాలా పెద్ద సూపర్ మార్కెట్ అన్నమాట. అందులో బీర్లు, విస్కీలు కూడా అమ్ముతుంటారు.
బీర్లూ విస్కీలూ అంటే గుర్తొచ్చింది, పొగ త్రాగడం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం, తెలుసుకదా. మనం మళ్ళీ మన కథలోకి వచ్చేద్దాం.
అక్కడ ఒక కాటన్ బీర్లు 500 మాత్రమే అని ఆఫర్ పెట్టారు. వాహ్ రే వాహ్ అని రెండు కాటన్ లు
తీసి ట్రాలీ లో వేసేసుకున్నా. ఇంతలో మా ఆవిడ "ఏంటది అన్ని బీర్లు కొన్నారు, షాప్ ఏమన్నా పెట్టబోతున్నారా?" అని అడిగింది.
దానికి నేను " ఇలాంటి ఆఫర్లు మళ్ళీ మళ్ళీ రావు డార్లింగ్, నెలంతా సరిపడా స్టాక్ తీసేస్కున్నా" అన్నాను.
మా ఆవిడ "మన దగ్గర ఇప్పుడు ఈ చెత్త కొనడానికి డబ్బులు లేవు" అని మొత్తం బీర్లన్నీ తీసేసి షాపులో పెట్టేసింది.
కాస్త ముందుకి వెళ్ళాక మా ఆవిడ ఒక బ్యూటీ క్రీమ్ తీసి ట్రాలీలో వేసింది. ఏంటా అని చూస్తే అది 1400 రూపాయలు రేటు ఉంది.
"ఏమోయ్ బీర్లు కొనడానికి వెయ్యి రూపాయలు లేవు కానీ 5 రూపాయల ఐస్ క్రీమ్ కప్ అంత లేదు ఇది 1400 ఆ" అన్నాను నేను.
" ఇది మీకు నేను అందంగా కనిపించడం కోసం " అంది నా భార్య వయ్యారంగా.
"నేను బీరు తాగేది కూడా నువ్వు నాకు అందంగా కనిపించడానికేనే వెర్రి మొహమా, 100 రూపాయలతో అయిపోయేదానికి 1400 ఎందుకే " అన్నాను కాస్త ఆవేశంగా. ఆ తరువాత నా భార్య కోపంగా నా వైపుకి రావడం మాత్రమే నాకు గుర్తుంది.
తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు కానీ రెండు రోజుల తరువాత హాస్పిటల్లో కళ్ళు తెరిచా.

0 Comments