యెంకట్రావ్  ఒక హోటల్  లో టిఫిన్ చేసి బయటి కొచ్చాడు.....

ఎదురుగా రోడ్డు మీద దహన సంస్కారానికి వెళ్తున్న శవం దాని వెనుక వెళ్తున్న గుంపు కనిపించింది.. దానివెనుకే మరో శవంతో వెళ్తున్న గుంపు కూడా కనిపించింది..

ఈ రెండింటి వెనుక ఒక పెద్ద మనిషి ఒక కుక్కని పట్టుకుని సింగిల్ గా నడుస్తున్నాడు..
ఆ పెద్ద మనిషి వెనుక క్యూలో 200మంది లైన్ గా ఒక పద్దతిలో ఫాలో అవుతూ  నడుస్తున్నారు ఆ విచిత్ర దృశ్యం గంగాధర్ ని ఆశ్చర్యపరిచింది..

శవ దహనానికి వెళ్ళేవారు ఈ విధంగా లైన్ లో వెళ్ళటాన్ని ఎప్పుడూ చూడలేదే అని గంగాధర్ మనసులో అనుకొని కుతూహలం ఆపుకోలేక ఆ పెద్దమనిషి దగ్గరకెళ్ళి ఇలా మాట్లాడుతున్నాడు..... " సార్ ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి.

ఇలా లైన్లో శవ దహనానికి వెళ్ళే వాళ్ళనింతవరకూ నేనెక్కడా  చూడలేదు. ఇంతకీ ఈ అంత్య క్రియలెవరికి సార్ ?" అని అడిగాడు..

పెద్ద మనిషి : " మెదటి శవం నా భార్యది. "

యెంకట్రావ్: " అయ్యో ఎలా  జరిగింది ?"

పెద్ద మనిషి : ఈ కుక్క మా ఆవిడ  పై అటాక్ చేసి చంపేసింది. "

యెంకట్రావ్: " అయ్యయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది.. మరి రెండవ శవం సార్ ?"

పెద్ద మనిషి : " అది మా అత్తగారిది. ఆమె మా అవిడని కాపాడటానికి ట్రై చేసింది. అప్పుడు  రెచ్చిపోయిన కుక్క ఆమెని కూడా పొట్టన పెట్టుకుంది అంటూ విలపిస్తూ చెప్పాడా పెద్ద మనిషి "
అది విన్న యెంకట్రావ్  కొద్దిగా ఆలోచించి.....

యెంకట్రావ్: మీ కుక్కని నాకు కొన్ని రోజులు ఇవ్వగలరా? ఎంత కావాలంటే అంత ఇస్తాను..

పెద్ద మనిషి : "వెళ్ళి ఆ 200 మంది వెనుక క్యూలో నిల్చోండి.. "⁠⁠⁠⁠