ఒక ముసలావిడ హైదరాబాద్ లో ఒక 5 స్టార్ హోటల్ లో తన గదికి వెళ్ళడానికి లిఫ్ట్ ఎక్కింది. ఇంతలో ఒక అందమైన అమ్మాయి వచ్చి అదే లిఫ్ట్ ఎక్కింది. ఆ అమ్మాయి ఎక్కగానే లిఫ్ట్ అంతా అద్భుతమైన వాసనతో నిండిపోయింది. ఆ ముసలావిడ వాసన పీల్చి చాల బాగుంది అన్నట్టు 'హా' అంది. అది వినగానే ఆ అమ్మాయి ఎంతో గర్వంగా "రొమాన్స్ సెంట్ రాల్ఫ్ లారెన్ కంపెనీ వాళ్ళది బాటిల్ రూ.5000" అని చెప్పింది. లిఫ్ట్ రెండు అంతస్తులు పైకి వెళ్లి ఆగింది.


ఇంతలో ఇంకో అందమైన అమ్మాయి ఎక్కింది. ఈసారి ఇంకా మహాద్భుతమైన వాసనతో లిఫ్ట్ అంతా ఘుమఘుమలాడింది. లిఫ్ట్ లో ఉన్న ఇద్దరూ ఆ వాసనకి చాలా బాగుంది అన్నట్టు ముఖం పెట్టారు. అది గమనించిన ఆ అమ్మాయి ఎంతో గర్వంతో "ఛానల్ నెంబర్ 5 సెంట్ బాటిల్ రూ.10000 అని చెప్పి ముఖం తిప్పేసుకుంది.

వీళ్ళిద్దరి వేషాలు చూసి ముసలావిడకి చిర్రెత్తుకొచ్చింది. ఇంతలో తను దిగాల్సిన అంతస్తు వచ్చింది. ఆ పెద్దావిడ ఇద్దరి కళ్ళలోకి చూసింది. అలా చూస్తూ తను కాస్త వంగి డుర్.ర్.ర్.ర్ అని ఒక పిత్తు పిత్తి ఇలా అంది "ముద్ద పప్పు కిలో రూ.50 మాత్రమే" అని దిగి వెళ్ళిపోయింది.


Facebook లో లైక్ చెయ్యడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Instagram లో ఫాలో అవ్వడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Twitter లో ఫాలో అవ్వడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి