అనగనగా ఒక రోజు ఒకతను పిచ్చి ఆసుపత్రికి వెళ్ళాడు. అసలు పిచ్చి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి వైద్యం ఎలా చేస్తారో తెలుసుకోవాలని అతనికి చిన్న కోరికన్నమాట. అతను ఎందుకు వచ్చాడో అక్కడ ఆసుపత్రిలోని పెద్ద డాక్టర్ గారికి చెప్పాడు. సరే వీడి కోరిక ఎందుకు కాదనాలి అని డాక్టర్ గారు "సరే పద చూపిస్తాను వైద్యం ఎలా చేస్తామో " అని అతన్ని ఆసుపత్రి లోపలి వార్డ్లు ఉండే చోటికి తీసుకువెళ్ళాడు.

"డాక్టర్ గారు ఇంతకీ పిచ్చి తగ్గిందని మీరు ఎలా తెలుసుకుంటారు? దానికి ఏమైనా టెస్టులు చేస్తారా?" అని అడిగాడు ఆ అబ్బాయి.

"అదా, దానికి ప్రత్యేకంగా టెస్ట్లు గట్రా ఏమీ ఉండవు బాబు. కానీ ఒక చిన్న పరీక్ష పెడతాం, అందులో గనుక వాళ్ళు పాస్ అయిపోతే వాళ్ళని ఇంటికి పంపించేస్తాం" అని డాక్టర్ గారు అన్నారు.

"అవునా ! ఏం పరీక్ష డాక్టర్ గారు ?" ఆశ్చర్యంగా అడిగాడు ఆ అబ్బాయి.

" అది చాలా చిన్న పరీక్ష. ఒక బాత్ టబ్ నిండా నీళ్ళు నింపుతాం. ఎవరైతే పరీక్షకి వస్తారో వాళ్ళకి ఒక చెంచా, ఒక మగ్గు, ఒక బకెట్ ఇచ్చి ఆ బాత్ టబ్ ని ఖాళీ చేయమని చెప్తాం." అని అన్నాడు డాక్టర్ గారు.

"హ హ అర్ధమైంది డాక్టర్ గారు. మాములు మనుషులు ఆ టబ్ ని ఖాళీ చేయడానికి బకెట్ వాడుతారు, ఎందుకంటే బకెట్ తో ఐతే త్వరగా ఆ బాత్ టబ్ ని ఖాళీ చెయ్యొచ్చు కాబట్టి." అన్నాడు ఆ అబ్బాయి కాస్త ఉత్సాహంగా.

"కాదు బాబు , మాములు మనిషి ఐతే బాత్ టబ్ ప్లగ్ లాగేసి దాన్ని ఖాళీ చేస్తాడు. నీకు కూడా ఒక మంచం కిటికీ పక్కన వేయించామంటావా " అన్నారు డాక్టర్ గారు ముసి ముసి నవ్వులు నవ్వుతూ. 




Yetakaram Yenkatrao ని  Facebook లో లైక్ చెయ్యడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Yetakaram Yenkatrao ని Instagram లో ఫాలో అవ్వడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Yetakaram Yenkatrao ని Twitter లో ఫాలో అవ్వడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి