టీ ఇంత భయంకరమైనది అని ఇప్పుడే తెలిసింది [Telugu Joke Story]




Yetakaram Yenkatrao ఫాన్స్ అందరికీ ముఖ్య గమనిక. 

బీరు కంటే టీ చాలా ప్రమాదకరమైనది. దయచేసి టీ తాగకండి.

నాకూ ఈ విషయం నిన్న రాత్రే తెలిసింది. నేను నిన్న సాయంత్రం బార్లో స్నేహితులతో కలిసి మందు తాగాను. మొత్తం 14 బీర్లు తాగేసా. బార్లోనే రాత్రి 2 దాటింది. ఇంటికి వచ్చేసరికి 3 అయ్యుంటుంది.

నా భార్య నాకోసం ఎదురు చూస్తూ టీ తాగుతూ కూర్చుంది. నేను ఎంతో ప్రశాంతంగా ఇంట్లోకి వచ్చి "హాయ్ బంగారం ఇంకా పడుకోలేదు " అన్నాను.

మీరు నా భార్యని చూడాలి ఆ సమయంలో , మొత్తం వీధి టాప్ లేచిపోయేలా అరిచింది. రాత్రంతా నన్ను తిడుతూనే ఉంది. కోపంతో ఊగిపోయింది. పూనకం వచ్చినదానిలా నన్ను కొట్టినంత పని చేసింది. ఇవాళ పొద్దున్న కూడా అలానే చేస్తుంది.

అందుకే చెప్తున్నా టీ తాగడం మానేయండి. ఇప్పుడు కూడా నన్ను ఈ పోస్టు పెట్టనివ్వకుండా  నా లాప్టాప్ లాగేసుకుంటుంది.

మీరు మాత్రం ఈ విషయం అందరికి తెలిసేలా షేర్ చేయండి.




Yetakaram Yenkatrao ని  Facebook లో లైక్ చెయ్యడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Yetakaram Yenkatrao ని Instagram లో ఫాలో అవ్వడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Yetakaram Yenkatrao ని Twitter లో ఫాలో అవ్వడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి


Post a Comment

0 Comments