అనగనగా ఒక రోజు ఒక కోటీశ్వరుడు తన ఇంట్లో ఒక పెద్ద పార్టీ ఇస్తున్నాడు. అతని ఇల్లు చాలా పెద్దది. ఆ పెద్ద ఇంట్లో ఒక పెద్ద ఈత కొలను (స్విమ్మింగ్ పూల్ ) ఉంది. ఆ పెద్ద ఈత కొలనులో ఒక పెద్ద షార్క్ చేప (సొర చేప) ఉంది.

ఆ పెద్ద మనిషి పార్టీలో ఒక పోటి పెట్టాడు. పోటి ఏంటంటే అతని పెద్ద స్విమ్మింగ్ పూల్ లో ఒక పక్క నుంచి ఇంకో పక్కకి షార్క్ చేపకి దొరకకుండా ఈదుకుంటూ వెళ్ళాలి . పోటిలో గెలిచిన వాళ్ళకి తన యావదాస్తిని , తన భార్యని , బంగారాన్ని, వజ్రాలన్నీ ఇచ్చేస్తా అన్నాడు. 


ఆ పెద్ద మనిషి చెప్పిన మాటలు విని అందరూ తేరుకునే లోపు ఒకతను ఆ స్విమ్మింగ్ పూల్లో దూకేసి అత్యంత వేగంగా ఈదుతూ కనిపించాడు. అందరూ చూసేలోపు అతను ఈదుకుంటూ స్విమ్మింగ్ పూల్ అవతలి వైపుకు చేరుకున్నాడు. మొత్తానికి అతను కొలను మొత్తం ఈదేసాడు.

ఆ పెద్దమనిషి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి " అరేయ్ బాబు అదేంటిరా అలా దుకేసావ్? నేను అసలు ఎవరూ ఈదలేరు అనుకున్నా, నువ్వేమో టక్కున ఈదేసావ్. సరే కానీ మొత్తానికి నువ్వు గెలిచావ్. సరే నీకు నా ఆస్తి కావాలా ?" అని అన్నాడు . దానికి ఆ అబ్బాయి "వద్దు " అన్నాడు.

"అదేంటి మరి నా భార్య కావాలా ?" అన్నాడు ఆ పెద్దాయన. " నాకొద్దు " అన్నాడతను.

"మరి ఇంకేం కవాలిరా నీకు" అన్నాడు ఆ పెద్దాయన.


నన్ను ఆ స్విమ్మింగ్ పూల్ లోకి తోసిన ఆ దొంగ నా కొడుకు ఎవరో నాకు కావాలి " అన్నాడు ఆ అబ్బాయి.