ప్రపంచ క్రికెట్ లో అత్యంత సమర్ధవంతంగా రివర్స్ స్వీప్ ఆడగల వ్యక్తి ఎవరో గుర్తున్నారా ? అవును మనం మాట్లాడుకునేది జింబాబ్వే దేశ వికెట్ కీపర్ అయిన ఆండీ ఫ్లవర్ గురించే . ఆండీ ఫ్లవర్ ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి మన అందరి అభిమానం చూరగొన్నారు. కానీ ఆయన క్రికెట్ నుంచి ఎందుకు రిటైర్ అయ్యారో చాలా మందికి తెలియని విషయం. ఆండీ ఫ్లవర్ కెరీర్ అర్ధాంతరంగా ఎందుకు ముగిసిపోయిందో తెలుసుకుందాం .
2003 క్రికెట్ వరల్డ్ కప్ దక్షిణాఫ్రికా, కెన్యా, జింబాబ్వే దేశాలు సంయుక్తంగా నిర్వహించాయి . ఆ రోజుల్లో జింబాబ్వే దేశంలో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొని ఉంది. రాష్ట్రపతి రాబర్ట్ ముగాబే యొక్క విధానాలు తీవ్ర నిరసనకి గురయ్యాయి. క్రికెటర్లు ఆండీ ఫ్లవర్ , హెన్రీ ఒలాంగా కూడా రాష్ట్రపతి రాబర్ట్ ముగాబే విధానాలను వ్యతిరేకించారు. వారు అంతటితో ఆగకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారి నిరసన తెలియజేయడానికి జింబాబ్వే , నమీబియాల మధ్య జరిగిన అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లో నల్ల చేతి బ్యాండ్ కట్టుకున్నారు.
అంతటితో ఆగకుండా ఆ మ్యాచ్ అయిపోగానే ప్రెస్ మీట్ లో 450 పదాలు గల ప్రకటన చేసారు. ఆ ప్రకటన అంతర్జాతీయంగా "mourning the death of democracy in Zimbabwe" గా ప్రసిద్ధి పొందింది.
వాళ్ళ ప్రెస్ నోట్ లో ఈ కింది విధంగా రాసారు.
ఇలా ప్రెస్ నోట్ ఇవ్వడం తీవ్ర నిరసనలకు దారి తీసింది . హెన్రీ ఒలాంగాని అయితే చంపేస్తాం అని చాలా మంది బహిరంగంగానే బెదిరించారు. ఆ పరిస్థితుల్లో వారు దేశం వదిలి పారిపోవాల్సి వచ్చింది.
ఆండీ ఫ్లవర్ , హెన్రీ ఒలాంగా అలా దేశం విడిచి ఇంగ్లాండ్ కు పారిపోయారు. తర్వాత ఆండీ ఫ్లవర్ ఇంగ్లాండ్ క్రికెట్ టీం కి బ్యాటింగ్ కోచ్ గా కొన్ని రోజులు పని చేసారు.
ఒక గొప్ప ఆటగాడి కెరీర్ అలా అర్ధాంతరంగా ముగిసిపోయింది.
వాళ్ళ ప్రెస్ నోట్ లో ఈ కింది విధంగా రాసారు.
In all the circumstances, we have decided that we will each wear a black armband for the duration of the World Cup. In doing so we are mourning the death of democracy in our beloved Zimbabwe. In doing so we are making a silent plea to those responsible to stop the abuse of human rights in Zimbabwe. In doing so, we pray that our small action may help to restore sanity and dignity to our nation.

0 Comments