స్త్రీలలో నీరు తక్కువగా త్రాగడం వల్ల ఎక్కువగా వస్తుంది. చిక్కటి మూత్రం, పచ్చటి మూత్రం ఎక్కువ గంటలు ఆపి పొయ్యడం వల్ల, ఆ మూత్రం గాఢతకు మండుతుంది. ఎప్పుడూ మూత్రం మీ కంటికి తెల్లగా కనబడాలి. ఎప్పుడు పోసినా ధారగా రావాలి. ఎప్పుడూ మూత్రం చిక్కగా ఉండకూడదు. కంపు రాకూడదు.
చిట్కాలు:
- ప్రతి రోజూ నీటిని 4, 5 లీటర్లు త్రాగితే 2, 3 రోజులలో మూత్రంలో మంట తగ్గుతుంది.
- పగటి సమయంలో కూడా నీటిని టైము ప్రకారం త్రాగాల్సిందే. ఎండలో తిరిగేవారు ఇంకాస్త ఎక్కువ త్రాగుతూ ఉంటే మంట రాకుండా ఉంటుంది.
- మంట తగ్గడానికి పంచదార నీళ్ళుగాని, ఇతర పానీయాలు వృధా.

0 Comments