ఏదైనా వస్తువు పై కరోనా వైరస్ ఎంతకాలం బ్రతికి ఉంటుంది?
మార్కెట్ కు వెళ్ళి కూరగాయలు కొనడం ఎలా?
డెలివరీ బాయ్స్ తీసుకొచ్చే పార్సెల్స్, న్యూస్ పేపర్స్ ముట్టుకోవచ్చా?
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇలా ఎన్నో ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.
వీటిపై నిపుణులు ఏమంటున్నారో ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం.
ప్రస్తుతం లభిస్తున్న ఆధారాల మేరకు ఈ వైరస్ కేవలం శరీరం పైన మాత్రమే కాకుండా బయట కూడా మనుగడ సాగించగలదు. అప్పటికే వైరస్ ఉన్న వస్తువులు మీరు తాకి ఆ తర్వాత మీ ముఖాన్ని కానీ, కళ్ళు, ముక్కలు గాని ముట్టుకున్నట్లైతే మీకు కూడా ఈ వైరస్ సోకే ప్రమాదం ఉంది.
2020 మార్చిలో వెలువడిన ఒక పరిశోధన ప్రకారం ప్లాస్టిక్, స్టెయిన్లెస్ స్టీల్ వస్తువులపై ఎక్కువ కాలం అంటే రెండు నుంచి మూడు రోజులు, చెక్కలపై 24 గంటల పాటు మనుగడ సాగించగలదు. మిగిలిన చోట్ల తక్కువ ప్రభావం చూపిస్తుంది.
బయటి నుంచి తెప్పించుకున్న ఆహారపదార్థాల విషయానికి వస్తే డెలివరీ బాయ్ నుంచి తీసుకున్న తర్వాత మీ చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. తరువాత ఆ పార్సెల్స్ పై శానిటైజర్ స్ప్రే చేయాలి. ఆ తర్వాత మాత్రమే ఆ ప్యాకెట్ ని విప్పాలి. ఆ పై మరోసారి చేతులు శుభ్రం చేసుకున్న తర్వాత వాటిని వాడుకోవచ్చు.
న్యూస్ పేపర్ విషయానికొస్తే మరీ అంత కంగారు పడాల్సిన పనిలేదు. వాటిపై వైరస్ తక్కువ సమయం మాత్రమే మనుగడ సాగించగలదు. అయినప్పటికీ పేపర్ ముట్టుకునే ముందు ఆ తరువాత చేతిని శుభ్రపరుచుకోవడం మంచిది.
వైరస్ మనుగడని దృష్టిలో పెట్టుకొని తరచు ముట్టుకునే ప్లాస్టిక్ వస్తువులు, డోర్ హ్యాండిల్స్ వంటి స్టీల్ వస్తువులను శానిటైజర్ లాంటి రసాయనాలతో తరచూ శుభ్రపరచడం తప్పనిసరి.
పళ్ళు, కూరగాయలు ఇంటికి తీసుకు వచ్చిన తర్వాత వాటిని నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆపై పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత మీరు కూడా మీ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

కూరగాయల మీద సాధారణ పరిస్థితుల్లో కరోనా వైరస్ ఉండదని నిపుణులు చెబుతున్నారు. వాటికి పొలాల్లో వాడే క్రిమిసంహారక మందులే కారణం. అయితే, బజారులో ఎవరైనా కరోనా సోకిన వ్యక్తి ఉండి, పొరపాటున అతని దగ్గు, తుమ్ము తుంపర్లు వాటిమీద పడితే కరోనా వైరస్ వాటిమీద చేరే అవకాశం ఉంటుంది.
ఇది మనకు తెలియకుండా జరుగుతుంది. అందుకే, కూరగాయలు ఇంటికి తీసుకువచ్చాకా వాటిని శుభ్రం చేసుకోవడం తప్పనిసరి.
చాలా మంది కూరగాయలను ఎండలో పెట్టడం వంటి పనులు చేస్తుంటారు. వేడికి వైరస్ చచ్చిపోతుందనే ఆలోచనతో. కానీ, ఇది సరికాదు. వేడి వాతావరణంలో వైరస్ ముఖ్యంగా కరోనా చనిపోతుందని చెప్పే ఆధారాలు ఇంకా ఏమీ లేవు.
కూరగాయలను శుభ్రంగా కడగడం ద్వారా మాత్రమే సురక్షితంగా ఉండవచ్చు. కూరగాయలను బజారు నుంచి తీసుకురాగానే ఉప్పు నీటితో కడగడం మంచిది. కుళాయి నీటి కింద కడగడం క్షేమకరం.
వైరస్ ఉన్నా, లేకపోయినా ఇలా చేయడం వళ్ళ కూరగాయల మీద ఉండే క్రిమిసంహారక మందుల అవశేషాలు, ఇతర బాక్టీరియా నశించే అవకాశాలుంటాయి.
ఇక చాలా మంది కూరగాయలు కోసిన తరువాత శుభ్రం చేస్తారు. ఈ విధానం అంత మంచిది కాదు. పొటాషియం పర్మాంగనేటు ద్రావణం తో కూరగాయల్ని కడుక్కుంటే మంచిది. తరువాత మంచి నీటితో శుభ్రం చేసుకుని వాడుకోవాలి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కూరగాయలు పచ్చిగా తినకపోవడమే మంచిది. బాగా ఉడికించిన తరువాతే తినడం శ్రేయస్కరం. ఇక కూరగాయల కోసం వాడిన సంచుల్ని కూడా వెంటనే శుభ్రం చేసుకోవాలి. వాడి పాడేసే సంచులైతే, వాటిని బయట డస్ట్ బిన్ లో పడేసి మూట పెట్టాలి.
ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కూరగాయల నుంచి వచ్చే ఇబ్బందులు ఉండవు. పైగా ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఎంతో ఉపయోగపడే ఈ వ్యాసాన్ని మీ మిత్రులకి షేర్ చెయ్యండి మరియు మీ అభిప్రాయాలని కామెంట్ చెయ్యండి.
ఎంతో ఉపయోగపడే ఈ వ్యాసాన్ని మీ మిత్రులకి షేర్ చెయ్యండి మరియు మీ అభిప్రాయాలని కామెంట్ చెయ్యండి.

0 Comments