ఎండలో మనం తిరిగేటప్పుడు, ఎండ నుండి మన చర్మము రక్షించుకునేందుకు మన శరీరము తనలో ఉన్న నీటిని ఆవిరి చేస్తూ, చర్మాన్ని చల్లబరుచుకుంటూ ఉంటుంది. శరీరం ఈ కార్యాక్రమాన్ని చేయాలంటే తన లోపల సరిపడా నీరు ఉండాలి. ఆ నీరు లేకుండా ఎండలోనికి వెళ్ళే వారికి, లోపల ఉన్న నీరు కొంత చర్మానికి ఖర్చు అవ్వడంతో, శరీరంలో అవసరానికి సరిపడా నీరు తగ్గిపోతుంది.


శరీరంలో నీరు తగ్గేసరికి తలకు రక్త ప్రసరణ సరిగా జరగపోవడం, అందులో నీటి శాతం తగ్గటం ఇవన్నీ కలిసి తల సున్నితమైన భాగం కాబట్టి ఇక కళ్ళు తిరగటం, తూలడం మొదలగునవి జరుగుతూ ఉంటాయి. రోహిణీకార్తెలలో కూడా వేడి మనల్ని ఏమీ చేయకుండా వెన్నెల్లో తిరిగినట్లుగా ఎండలలో తిరగాలంటే.
చిట్కాలు:
  1. ఎప్పుడు బయటకు వెళ్ళినా మీ కూడా నీరు ఉంచుకుని పొట్ట ఖాళీగా ఉన్నప్పుడల్లా గంటకు 2, 3 గ్లాసుల చొప్పున త్రాగుతూ ఉండాలి.
  2. దాహం వేసినపుడు నీటినే త్రాగండి తప్ప ఇతర పానీయాలు త్రాగకండి. అవి దాహాన్ని తీర్చవు. రక్తంలోనికి నీటిలా ఆ డ్రింక్స్ త్వరగా చేరవు.
  3. వేసవి ఎండలో కూడా మూత్రం సాఫీగా వచ్చేటట్లు మనం నీటిని త్రాగుతూ ఉండాలి.
  4. ఎండలో తిరిగేవారు తెల్లని కాటన్ బట్టలు వేసుకుంటే ఆ వేడిని త్రిప్పి కొడతాయి.
ఈ ఉపయోగకరమైన విషయాన్ని మీ ఆత్మీయులకి షేర్ చెయ్యండి.