సన్ ఎలర్జీ రాకూడదంటే.??


సూర్యుడు అన్నింటికి ప్రాణం పోస్తూ ఉంటే, మనిషికి మాత్రం ఆరోగ్యానికి బదులు ఎలర్జీ వస్తున్నది. కొందరికి ఎండ తగిలే భాగాలలో చర్మం నల్లగా పేడుకట్టినట్లుగా మాడి ఉంటుంది. బట్ట క్రింద భాగాలు బాగానే ఉంటాయి. ఇక ఎండలోనికి వెళ్ల కుండా జాగ్రత్త పడతారే తప్ప తప్పును సవరించుకునే ప్రయత్నం చేయరు. నీరు తక్కువగా త్రాగే వారందరికీ సన్ ఎలర్జీ వస్తుంది. ముఖ్యంగా స్త్రీలు నీళ్ళు త్రాగనందు వల్లే ఎక్కువగా స్త్రీలకు వస్తుంది.

చెట్టుకు సరిపడా నీరు చాలనప్పుడు ఆ ఆకులు ఎండను తట్టుకోలేవు మాడిపోతాయి. మనలో జరిగేది కూడా అంతే. ఎండ వేడిని తట్టుకోవడానికి చర్మంలోని నీరు ఆవిరై చర్మాన్ని చల్ల బరుస్తూ ఉంటుంది. శరీరంలో సరిపడా నీరు లేని వారికి చర్మం ఆ వేడి నుండి రక్షించుకోలేక మాడిపోతుంది. ప్రమిదలో నూనె ఉన్నంత సేపూ ఆ మంట ఒత్తిని కాల్చలేదు. అలానే మనలో సరిపడా నీరు ఉన్నంత సేపూ ఎంత ఎండైనా మన చర్మాన్ని ఏమీ చేయలేదు.
చిట్కాలు:
రోజుకి 5 లీటర్ల మంచి నీరు త్రాగాలి. ప్రతి రోజూ ఎండలోనికి వెళ్ళబోయే ముందు మీలో నీరు సరిపడా ఉండేట్లు త్రాగి వెళ్ళండి. ఎండలో తిరిగినా, ఎండలో పని చేస్తున్నా మీకు మూత్రం తెల్లగా, సాఫీగా వచ్చేటట్లు నీటిని త్రాగండి. నల్లగా మారిన చర్మం మామూలుగా రావడానికి 5, 6 నెలలు పడుతుంది.
ఈ ఉపయోగకరమైన విషయాన్ని మీ ఆత్మీయులకి షేర్ చెయ్యండి.

Post a Comment

0 Comments