కడుపు నొప్పి వస్తే నొప్పికి మాత్ర వేసుకుని నొప్పిని పూర్తిగా తగ్గించుకుని, కడుపును వదిలివేస్తారు. దాంతో మరలా మరలా వస్తూ ఉంటుంది. ముఖ్యముగా పిల్లలలో ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం బాగా ఉన్నవారిలో ఈ సమస్య ఉంటుంది.


కారణాలు చూస్తే, పొట్ట నిండా భోజనం తిన్న తరువాత, ఈ బరువు వెళ్ళి మలం ప్రేగుపై పడితే ఆ ఒత్తిడికి నొప్పి కొందరికి తిన్నాక వస్తుంది. విరేచనం అయ్యాక, అది పూర్తిగా కాక నొప్పి వస్తుంది. ప్రేగులలో బంక బాగా ఉన్నప్పుడు అది కదిలేటప్పుడు నొప్పి కలుగవచ్చు. ప్రేగులలో గ్యాసు పట్టేసి కడుపు నొప్పి రావచ్చు.

ఏ కారణాల చేత వచ్చినా మనకు నొప్పి తగ్గాలి, నొప్పికి మూలమైన మలమూ పోవాలి.
చిట్కాలు:
  1. ఎప్పుడు నొప్పిగా ఉన్నా ఆ నొప్పి భాగంపై నూనె రాసి వేడి నీటి బ్యాగ్ కాపడం రోజుకి 2, 3 సార్లు పెట్టుకోవచ్చు.
  2. ఎనిమాని రెండు పూటలా 2, 3 రోజుల పాటు చేస్తే ప్రేగులలో మలం అంతా పోతుంది.
  3. అన్నం కూరలు పెట్టడం మాని పళ్ళ రసాలు, పండ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, తేనె నీళ్ళు, మంచి నీళ్ళు మొదలగు ద్రవాహారాలతోనే రెండు రోజులుంచడం మంచిది.
  4. రోజూ రెండు పూటలా ఎనిమాకి ముందు పొత్తికడుపుపై తడిగుడ్డ లేదా మట్టిపట్టీ గాని 20 నిమిషాలుంచి తీసివేస్తే మలం బాగా కదులుతుంది.
  5. మలబద్ధకం మళ్ళీ రాకుండా ఆహారం తిని, నీళ్ళు బాగా త్రాగి రోజుకి 2, 3 సార్లు విరేచనం అయితే ఇక నొప్పిరాదు.
ఈ ఉపయోగకరమైన విషయాన్ని మీ ఆత్మీయులకి షేర్ చెయ్యండి.