దీనినే సయాటిక్ నొప్పి అంటారు. వెన్ను నుండి ఒక పెద్ద నరము తుంటి నుండి తొడ వెనుక భాగం గుండా, పిక్క నుండి పాదం వరకు వెళుతుంది. ఇలా రెండు కాళ్ళలో ఈ సయాటిక్ నరము ఉంటుంది. ఈ నరము నడుము భాగములో పూసల మధ్య ఒత్తిడికి గురి కావడము వల్ల కాలులో జాలుగా, నరము లాగుతూ, తిమ్మిరిగా, గుంజినట్లుగా ఉంటుంది. నొప్పి కాలుకి వెనుక భాగంలో వస్తుంది.
చిట్కాలు:
- క్రింద కూర్చోకూడదు, వంగే పనులు మానాలి.
- ఎప్పుడు పడుకున్నా, ఖాళీగా ఉన్నప్పుడల్లా లావు దిండును మోకాళ్ళ క్రింద పెట్టి వెల్లకిలా పడుకుంటే కాస్త హాయిగా ఉంటుంది. తలుపు సందున వైరు నలిగినట్లుగా నరము ఇబ్బంది పడేది తగ్గుతుంది.
- శలభాసనము అనే ఆసనాన్ని వేస్తే చాలా బాగా తగ్గుతుంది. మొదటి 8, 10 రోజులు ఒక పూటే తేలిగ్గా ఈ ఆసనాన్ని వేసి తీసివేయాలి. అలవాటు అయ్యాక రెండు పూటలా ఎక్కువ సేపు వేయగలిగితే మంచిది.
- ఎక్కడ కూర్చున్నా నడుము నిటారుగా ఉంచుకుంటే మంచిది.
- వీలున్నంతవరకు విశ్రాంతిగా ఉంటే త్వరగా తగ్గుతుంది.
1 Comments
My god of war video game console : Video - Videodl.cc
ReplyDeleteWhat is the best? · What are the best video game console games you can play on your mobile septcasino phone? · What are the best console games youtube mp4 you can play on your Android phone? · What are the best youtube downloader