తలనొప్పి వేరు మాడు నొప్పి వేరు. ఒక్క మాడు భాగంలోనే ఇది వస్తుంది. బస్సు ప్రయాణాలలో, షాపింగులలో, ఎండలో తిరిగేటప్పుడు, టెన్షన్ వచ్చినప్పుడు ఎక్కువగా వస్తుంది. మంచి నీళ్లు తక్కువగా త్రాగి తిరిగే వారికి శరీరంలో నీరు చాలక, తలకు అందవలసిన రక్త ప్రసరణ అందక, రక్తంలో నీరు తగ్గడం వలన మాడు భాగం వేడెక్కువై మాడు నొప్పి వస్తుంది.
రేడియేటర్ నీళ్ళు తగ్గితే ఇంజన్ వేడెక్కినట్లే మనకు మాడు భాగం వేడెక్కుతుంది. పైన చెప్పిన సందర్భాలలో మూత్రం వస్తుందని నీరు త్రాగక తిరిగినందుకు మాడు నొప్పి వస్తుంది.
చిట్కాలు:
  1. ఎప్పుడు మాడునొప్పి అనిపించినా వెంటనే మాడుపై నీళ్ళతో తడిపి, కుదిరితే చేతిగుడ్డ తడిపి ఉంచుకోవచ్చు.
  2. పగలు మాడు నొప్పి వస్తే సాయంకాలం తలస్నానం చేయడం మంచిది.
  3. రోజూ నీరు బాగా త్రాగాలి. కూడా సీసా ఉంచుకుని కొంచెం కొంచెం పైన చెప్పిన సందర్భాలలో త్రాగితే మంచిది. మూత్రం రాదు. మాడు నొప్పి రాదు.
ఈ ఉపయోగకరమైన విషయాన్ని మీ ఆత్మీయులకి షేర్ చెయ్యండి.