మెడను ఎప్పుడూ ముందుకు వంచే పనులు చేసుకునేవారికి, నిద్రలో ఎత్తు దిండు వేసుకునే వారికి, మోటారు సైకిళ్ళపై గూనిగా కూర్చుని ఎక్కువసేపు నడిపేవారికి, వ్యాయామాలు అసలు చేయనివారికి, ఇంట్లో కూడా నడుమును, మెడను ముందుకు వంచి ఎక్కువగా కూర్చునే స్త్రీలకు మొదలగు వారికి మెడనొప్పులు వస్తూ ఉంటాయి.
మెడను ఎక్కువగా ముందుకు వంచియున్నందుకు మెడ పూసలు వాటి మధ్య నుండి డిస్క్ లను వత్తిడికి గురిచేస్తాయి. దాంతో మెడ నొప్పి పుడుతుంది. ఒక్కోసారి మెడభాగం నుండి చేతిలోనికి వచ్చే నరాలు నొక్కుకుని చేతిలో జాలు, తిమ్మిర్లు, వ్రేళ్ళు పట్టులేనట్లుగా అవ్వటం, చేతులలో నరాలు లాగినట్లు ఉండటం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. అసలు సమస్య మెడలో ఉండి చేతిలోనికి ఇలా వస్తుంది. కొందరికి మెడనొప్పి వల్ల కళ్ళు తిరగటం, తలనొప్పి రావడం, కొందరు పడిపోవడం కూడా జరుగుతుంది.
చిట్కాలు:
  1. ముందు తల క్రింద దిండు తీసివేయాలి.
  2. ఎప్పుడు కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా మెడ లైనుగా ఉండేటట్లు కూర్చోవాలి.
  3. మెడ భాగానికి కొబ్బరి నూనె రాసి వేడి నీటి బ్యాగ్ లో వేడి నీరు పోసి కాపడం రెండు పూటలా 10, 15 నిమిషాలు పెట్టుకుంటే మంచిది.
  4. మెడను ముందుకు వంచే ఆసనాలు చేయకూడదు. సూర్య నమస్కారాలు కూడా మానాలి. మెడను వెనక్కి వంచే ఆసనాలు అయిన మత్స్యాసనం, ఉష్ట్రాసనం, భుజంగాసనం చేస్తే సరిపోతుంది. ఇలా 20, 25 రోజులు చేస్తే చాలా వరకు తగ్గిపోతుంది. మెడనొప్పి లేనివారు ముందు నుండి పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే ఇక రాకుండా ఉంటుంది.
ఈ ఉపయోగకరమైన విషయాన్ని మీ ఆత్మీయులకి షేర్ చెయ్యండి.