ప్రపంచంలో అత్యధిక జనాభాని ఏడిపిస్తున్న సమస్య ఇది. ప్రతి రోజూ ప్రేగులలో లీటరు గ్యాసు తయారవడం ఆరోగ్య లక్షణం. ఒక వేళ ఎక్కువగా తయారైనా బయటకు ఫ్రీగా పోతే దాన్ని ట్రబుల్ అనకూడదు. తయారైన గ్యాసు క్రింద నుండో, పై నుండో రాక బిగిస్తే దాన్ని గ్యాస్ ట్రబుల్ అంటారు.
కొందరు గుండె నొప్పి వచ్చిందనుకునేంతగా గ్యాస్ పట్టేస్తుంది. స్త్రీ, పురుష భేదం లేకుండా అందరికీ గ్యాసు ఉత్పత్తి అవుతూ ఉంటుంది. కాకపోతే కొందరు సౌండుతో వదిలితే ఇంకొందరు సైలెంట్ గా వదులుతున్నారే తప్ప అందరికీ పోవడం మామూలే.
గ్యాస్ ట్రబుల్ కి ఐదు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.
- మల బద్ధకం వల్ల మలం ప్రేగులలో గ్యాసు ఎక్కువగా తయారవుతుంది. నిలవున్న మలం, పేడ పొయ్యి టాంకులో పేడ గ్యాసును తయారుచేసినట్లుగా తయారు చేస్తూ వుంటుంది. ఆ గ్యాసు బయటకు పోయే సందు లేకుండా ప్రేగంతా మలంతో పూడుకుని ఉండటం వల్ల, ప్రేగులో గ్యాసు పట్టేసి బొడ్డు క్రింద భాగం బిగదీయడం గాని, నొప్పి రావడం గాని జరుగుతుంది.
- తినేటప్పుడు మంచి నీళ్ళు త్రాగడం వలన జీర్ణక్రియ బాగా ఆలస్యంగా జరగడంతో ఆహారం పులిసి ఎక్కువ గ్యాసు తయారవుతుంది.
- ఆహారాన్ని బాగా నమలకుండా మ్రింగేవారికి, సరిగా జీర్ణక్రియ జరగక గ్యాసు తయారవుతుంది.
- ఆలస్యంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు, క్రొవ్వు పదార్థాలను తినడం వలన ఉదాహరణకు మాంసాహారం, పలావులు, గ్రుడ్లు, ప్రాసెస్డ్ ఫుడ్స్ మొదలగునవి. ప్రేగులలో ఎక్కువసేపు (సుమారు 6, 7 గంటలు) జీర్ణక్రియ కొరకు వుండడం వలన గ్యాసు అధికంగా తయారవుతుంది.
- మాంసకృత్తులున్న ఆహారము సహజంగా కొంత గ్యాసును ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. ఉదాహరణకు ఆకు కూరలు, గింజలు, కంది, పెసర పప్పులు 2, 3, 4, 5 కారణాల ద్వారా తయారైన గ్యాసు త్రేన్పుల ద్వారా పై నుండి వస్తుంది. లేదా పొట్ట, ఛాతీలలో బిగపట్టేస్తుంది.
చిట్కాలు:
- రోజూ విరేచనము సాఫీగా 2, 3 సార్లు అయ్యేటట్లు చూసుకోండి. నీళ్ళు త్రాగినా సాఫీగా అవ్వకపోతే 7, 8 రోజులు వరుసగా ఎనిమా (Enema) చేసికొని ప్రేగులను క్లీన్ చేసుకోండి.
- తినేటప్పుడు నీరు త్రాగడం మాని, తినడానికి అరగంట ముందు, తిన్నాక రెండు గంటల తరువాత త్రాగండి.
- ఆహారాన్ని మెత్తగా పిండి పిండిగా నమిలి మెల్లగా తినండి.
- నూనె పదార్థాలు, క్రొవ్వు పదార్థాలు, మాంసాహారాలు, పలావులు మాని ఆహారం తేలిగ్గా, త్వరగా జీర్ణమయ్యే వాటిని తినండి.
- ఆకు కూరలు, కంది పప్పు, పెసర పప్పు, చిక్కుడు కాయలు, మొలకెత్తిన విత్తనాలు 10, 15 రోజుల పాటు పూర్తిగా మానండి.
- ఉదయం పూట టిఫిన్ క్రింద ఇతర టిఫిన్ లు మాని పండ్లను, ఖర్జూరాన్ని మాత్రమే (సుగరు వ్యాధి ఉన్నవారు ఖర్జూరం వద్దు) తినండి.
- నిమ్మకాయ పులుపు, పచ్చిమిర్చిని వాడుకున్నా ఫరవాలేదు.
- సాయంకాలం భోజనాన్ని పెందలకడనే తిని ఆపండి.

0 Comments