పూర్వం కంటి చూపు తగ్గితే ఇక అక్కడ నుండి ముసలి వయస్సు వచ్చినట్లుగా లెక్కవేసుకునేవారు. ఈ మధ్య బాల్యదశ పూర్తి కాకుండానే కంటి చూపు తగ్గిపోతుంది. కొన్ని జీవులు 400 నుండి 1000 సంవత్సరాల వరకు జీవించేవి ఉన్నవి. అంతకాలం జీవించినా ఏ జీవికి ఇంత వరకు కళ్ళజోడు అవసరం తెలియకుండానే జీవించగలుగుతున్నాయి.
అన్నీ ఉడికించి, వార్చి, మాడ్చి, అందులో ఉప్పు, నూనెలు కలుపుకుని తినేసరికి, కంటి అవసరాలు ఆహారం ద్వారా తీరడం లేదు. ప్రకృతిలో పచ్చదనాన్ని చూసి విశ్రాంతి పొందవలసింది పోయి జిగేలుమనే రంగురంగుల బొమ్మలు చూసేసరికి శుభ్రంగా చెడిపోతున్నాయి. దీనికి పరిష్కార మార్గం, మళ్ళీ సహజంగా జీవించడమే.
చిట్కాలు:
- ప్రతిరోజూ ఉదయం క్యారెట్ కొంచెం ఎక్కువగా వేసుకుని పచ్చికూరల రసం త్రాగాలి.
- అవకాశమున్నవారు మునగ ఆకును రోజూ కొంత పచ్చికూరల రసంలో వేసుకుని త్రాగితే మంచిది. లేదా వారానికి 1, 2 రోజులు విడిగా మునగ ఆకు రసాన్ని తీసి దానిలో నీరు ఎక్కువగా కలిపి, తేనె, నిమ్మరసం కలుపుకొని త్రాగగలిగినా మంచిదే.
- రోజూ మధ్యాహ్నం భోజనంలో ఆకు కూరలను తప్పనిసరిగా వండుకుని తినాలి.
- అవకాశముండి దొడ్డిలో ఆకుకూరలను స్వయముగా పండించుకున్నవి అయితే పచ్చికూరల రసంతో రోజూ ఆకుకూరలను వేసుకుని త్రాగితే మరీ మంచిది. ఏ కాలంలో దొరికే పండ్లను ఆ కాలంలో రోజుకి 20 శాతమన్నా తినాలి.
- ఉప్పును ఎంత దూరంగా ఉంచగలిగితే అంత మంచిది. ఆ ఉప్పు వల్ల కంటిలో సూక్ష్మమైన రక్తనాళాలు తొందరగా పాడైపోతున్నాయి.

0 Comments