కొందరికి ఇంట్లో నుండి బయటకు రావడంతోటే ఆ పొగకు, దుమ్ముకు తుమ్ములు రావడం, ముక్కులు బిగదీయడం, గొంతులో నుసనుసగా ఉండడం మొదలగునవి వస్తాయి. కొందరికి కంటి దురదలు రావడం, ముఖం ఎరుపెక్కడం కూడా జరుగుతుంది.
ఇలాంటి వారు ఆ దుమ్మూ, పొగకు వెళ్ళకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇలా ఎన్నాళ్ళ పాటు దూరంగా ఉండగలం. వాటిని మన శరీరం శుభ్రం చేయగలిగేట్లు మన శరీరాన్ని బాగు చేసుకోవాలి తప్ప దూరం కావడం మార్గం కాదు.
బాగా దుమ్ము, ధూళిలో తిరిగేవారు బాగానే ఉంటారు. నీడ పట్టునుండి వెళ్ళక వెళ్ళక వెళ్లేవారికే ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎవరైతే రెక్కలు బాగా కదిలే పనులు రోజూ చేస్తారో వారికి ఇలాంటివి రావు.
చిట్కాలు:
- ప్రతిరోజూ త్రాగే 5 లీటర్ల నీరు గోరువెచ్చగా త్రాగడం మంచిది.
- ప్రతి రోజు ఉదయం దీర్ఘశ్వాసల ప్రాణాయామం 20, 30 నిమిషాల పాటు చేస్తే ముక్కు లోపలి భాగాలలో ఉండే ఇన్ఫెక్షన్ లాంటిది పోతుంది.
- ముఖానికి కొద్దిగా నూనె రాసి రోజూ ఒకసారన్నా నీటి ఆవిరి పడితే తేలిగ్గా ఉంటుంది.
- ప్రకృతిసిద్ధమైన సహజాహారాన్ని ఎక్కువగా రోజూ తినగలిగితే, త్వరగా రోగనిరోధక శక్తి పెరిగి ఆ ఎలర్జీ రాకుండా కాపాడుతుంది.

0 Comments