మలబద్ధకం ఉండే వారిలో ఈ సమస్య తరచుగా వస్తూ ఉంటుంది. నీళ్ళు బాగా తక్కువగా త్రాగుతూ పచ్చళ్ళు, నాన్ వెజ్ బాగా తినే వారిలో ఎక్కువగా ఉంటుంది. పీచు పదార్థం లేని ఆహారం తినేవారిలో మలం గట్టిగా రాళ్ళలాగా మారుతుంది. ఈ గట్టి మలాన్ని బయటకు పంపడానికి దొడ్లో చాలా మంది ముక్కుతూ ఉంటారు.
ముక్కేసరికి ఈ మలం ప్రేగుల అంచులను, రక్త నాళాలను చిట్లగొట్టుకుంటూ బయటకు వచ్చేసరికి ఆ మలం నుండి చెడ్డ సూక్ష్మజీవులు, హాని చేసే క్రిములు కోట్ల సంఖ్యలో పుడుతూ ఉంటాయి. ఆ క్రిములు ప్రేగుల వాతావరణాన్ని పాడు చేస్తాయి. ఆ క్రిముల ఇన్ఫెక్షన్ వల్ల ప్రేగులలోని రక్తనాళాలు పగిలి రక్తం తరచుగా పడుతుంది.
చిట్కాలు:
- మంచి నీటిని రోజుకు 5, 6 లీటర్ల వరకు త్రాగాలి. నీరు త్రాగినా విరేచనం సాఫీగా కాకపోతే 7, 8 రోజులు రోజూ ఎనిమా చేసుకోండి.
- దొడ్లో మాత్రం ముక్కే ప్రయత్నం మానాలి. నీళ్లు త్రాగి మనస్సు పెట్టి ప్రయత్నం చేసి, అర్జెంటుగా వెళ్ళాలనిపించే వరకు బయటే తిరిగి అప్పుడు వెళితే ముక్కవలసిన పని పోతుంది.
- ప్రేగులలో మలబద్ధకం పోవడానికి, రోజూ కూరలను బాగా ఎక్కువగా పెట్టుకుని రొట్టెలతో తినడం మంచిది. రొట్టెలు తిన్నాక పెరుగన్నం తినవచ్చు. కూరగాయలను తొక్కలు తీయకుండా లేతగా ఉన్న వాటిని వండుకోవాలి. సాయంకాలం కూడా ఇలానే తింటే మంచిది.
- ఉదయం పూట కేవలం పండ్లను తింటే మంచిది. ఇలా 15, 20 రోజుల పాటు మొలక గింజలు మాని పండ్లతో ఉండడం మంచిది. పండ్లను కూడా పిప్పి ఊయకుండా మ్రింగితే మంచిది.

0 Comments