వెలితిగా భోజనం చేస్తే సరిపోతుంది కదా! అనిపించవచ్చు కానీ కంచం దగ్గర కూర్చున్నాక అలా మాత్రం లేవలేక పోతున్నామని చాలా మంది అంటారు. భోజనం నిండుగా తింటూ దానికి తోడు మంచి నీటిని కూడా త్రాగుతారు. దీనితో పొట్ట ఫుల్ గా నిండి ఈ బరువంతా వెళ్ళి ఊపిరితిత్తుల చివరి భాగాలపై పడి, వాటిని సుమారుగా 25, 30 శాతం నొక్కి వేస్తుంది.
భోజనాన్ని అరిగించడానికి శరీరానికి ఎక్కువ గాలి అవసరం ఉంటుంది. దానికి తోడు ఊపిరితిత్తులు మూసుకుని పోయేసరికి శరీరానికి పూర్తిగా గాలి సరిగ్గా చాలక, భోజనం అయిన దగ్గర్నుండి భుక్తాయాసం వస్తుంది.
చిట్కాలు:
- భోజనాన్ని తినేటప్పుడు టేబుల్ పై కాకుండా క్రింద కూర్చుని తింటే మంచిది. క్రింద కూర్చునే సరికి పొట్ట పావు వంతు మూసుకుంటుంది. మీరు పూర్తిగా, నిండుగా తిని లేచేసరికి, మీకు తెలియకుండా కొంత ఖాళీ వచ్చి ఆయాసం ఉండదు.
- తినేటప్పుడు నీరు త్రాగకుండా, తినడానికి అరగంట ముందువరకు త్రాగి, తిన్న రెండు గంటల తరువాత అప్పుడప్పుడు ఒక్కొక్క గ్లాసు త్రాగుతూ ఉంటే భుక్తాయాసం రాదు.
- పొట్టను 80 శాతం కంటే నింపేటట్లు తినకుండా జాగ్రత్త పడటం మంచిది.

0 Comments