మలబద్ధకం ఉన్నవారికి ఆ చెడు సరిగా బయటకు పోక, తిరిగి శరీరంలో చేరి అది చివరకు బయటకు పోవడానికి చర్మంలో చేరుతుంది. చెమట సరిగా పట్టనివారికి ఆ చెడు చర్మంలో మిగిలిపోయి రకరకాల ఎలర్జీలను కలిగిస్తూ ఉంటుంది. 
కొందరికి దురదలు వస్తే, మరి కొందరికి దద్దుర్లు వస్తాయి. కొందరికి పొక్కులుగా వస్తాయి. ఏదేమైనప్పటికీ అటు శరీరము, ఇటు చర్మం రెండూ శుభ్రం అయితేగాని దురదలు తగ్గవు.
చిట్కాలు:
  1. ప్రతి రోజూ స్నానానికి వెళ్ళేముందు దురదగా ఉండే భాగంలో నిమ్మరసం రాసుకుని 5, 10 నిమిషాలు ఆగి స్నానం చెయ్యడం మంచిది.
  2. స్నానం అయ్యాక దురదలు వచ్చే భాగంలో కొబ్బరినూనె రాసుకుంటే కొంత ఉపశమనంగా ఉంటుంది.
  3. మరీ దురదలు ఎక్కువగా ఉన్నవారైతే వారానికి రెండు సార్లు చర్మానికి నీటి ఆవిరి పట్టి, ఆ చెడును శుభ్రం చేసుకోవడం మంచిది.
  4. మంచి నీరు 5 లీటర్ల త్రాగితే రక్తం బాగా శుభ్రపడుతుంది. ఎలర్జీలను నీరు బాగా తగ్గిస్తుంది.
  5. మలబద్ధకం పూర్తిగా పోయేట్లు జాగ్రత్త పడాలి.
  6. రోజుకి 50 శాతం ఆహారం కేవలం పండ్లు, పండ్ల రసాలతో ఉంటే త్వరగా రక్తం మారి లోపల దోషాలు పోతాయి.
ఈ ఉపయోగకరమైన విషయాన్ని మీ ఆత్మీయులకి షేర్ చెయ్యండి.