లాక్‌డౌన్ అమల్లో ఉన్నందున తరగతుల నష్టాలు, ఆన్‌లైన్ విద్య అంశాలపై అధ్యయనం చేయాల్సిందిగా కోరుతూ యూజీసీ 2 కమిటీలను నియమించింది.
లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్, పరీక్షల నిర్వహణ పలు అంశాలపై హర్యానా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఆర్‌సీ కుహాడ్ నేతృత్వంలోని ఓ కమిటీ అధ్యయనం చేసింది.
ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ పై ఇందిరాగాంధీ నేషనల్ యూనవర్సిటీ ఉప కులపతి సి.నాగేశ్వరరావు నేతృత్వంలోని కమిటీ అంశాన్ని పరిశీలించింది. ఈ రెండు కమిటీలు శుక్రవారం నివేదికలు సమర్పించాయి.

విశ్వవిద్యాలయాల్లో క్లాసులు సెప్టెంబర్ నుంచి ప్రారంభించాలని మొదటికమిటీ సిఫార్సు చేసింది. లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ అన్ని మౌలిక సదుపాయాలు అమలులో ఉన్నట్లైతే ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించొచ్చని తెలిపింది.ఇక లాక్ డౌన్ ముగిశాక పెన్ను-పేపర్ విధానంలో నిర్వహించాలని రెండో కమిటీ సూచించింది అని యూజీసీవర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం ఈ రెండు నివేదికలను అధికారులు పరిశీలిస్తున్నారని, ఈ విషయమై వచ్చే వారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు.
అయితే ఎప్పటకప్పుడు కరోనా పరీక్షలు గమనిస్తున్నామని, నీట్ జేఈఈ పరీక్షలను జూన్‌లో నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

0 Comments