నిన్న మ్యాచ్ చూసిన వాళ్ళకి ఈ విషయం తెలిసే ఉంటుంది, కాని మనలో చాలా మందికి ఈ విషయం తెలీదు. భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మొదటి రోజున ఒక సరదా సన్నివేశం జరిగింది.

భారత పేస్ బౌలర్ ఉమేష్ యాదవ్ తన మొదటి ఓవర్ రెండో బంతికి డేవిడ్ వార్నర్ ను క్లీన్ బౌల్డ్ చేసాడు. అద్భుతమైన ఇన్ స్వింగర్ కి వార్నర్ ఇన్సైడ్ ఎడ్జ్ అయ్యి బౌల్డ్ అయ్యాడు. ఇంతలో నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న మాట్ రెంషా పరుగు పరుగున పెవీలియన్ కు వెళ్ళిపోయాడు .

అదేంటి అవుట్ అయ్యిందేమో వార్నర్ కానీ రెంషా వెళ్ళిపోతున్నాడు అని అందరు ఆశ్చర్యానికి గురయ్యారు. కానీ తరువాత తెలిసిన విషయం ఏంటంటే రెంషాకి అర్జెంటుగా టాయిలెట్ కి (2) వెళ్ళాల్సి వచ్చిందంట. ఏం చేస్తాడు పాపం మరి, లంచ్ విరామానికి ఇంకా అరగంట సమయం ఉంది అప్పటికి . ఇక ఏం చెయ్యాలో తేలిక అంపైర్ కి చెప్పి రిటైర్డ్ అవుట్ గా పెవిలియన్ కి వెళ్ళిపోయాడు.

అదండీ మరి సంగతి, ఇంకా చూస్తారేం ఫ్రెండ్స్ అందరికి ఈ విషయం గురించి చెప్పండి మరి.