ఫ్లాష్ బాక్ :

చిన్నప్పుడు 'నిజాయితీ' పై ఒక కథ చదువుకున్నాము -

ఒక పేదవాడు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్లి కట్టెలు కొడుతుండగా..

గొడ్డలి జారి నదిలో పడిపోయింది.

అప్పుడు అతడు దీనంగా నది ఒడ్డున కూర్చోనుంటాడు.

అతనికి దేవుడు ప్రత్యక్షమై - "ఎందుకు బాధ పడుతున్నావ"ని అడుగగా...

"స్వామీ, నా గొడ్డలి పోయి నాకు బతుకు తెరువు లేకుండా పోయింది" అని చెప్పాడు.

అప్పుడు దేవుడు అతనికి బంగారు గొడ్డలి ఇవ్వగా ...

అతను అది నాది కాదంటాడు.

అలాగే  వెండి ,ఇత్తడి , రాగి గొడ్డల్లు ఇవ్వజూపగా...

అవి తనవి కాదంటాడు.

ఇనుప గొడ్డలి ఇవ్వగా అది తనదే అంటాడు.

 అతని 'నిజాయితీ' కి మెచ్చి దేవుడు అన్ని గొడ్డల్లు అతనికి ఇచ్చి వెళతాడు.  అది పాత కథ ...



ప్రస్తుతం:

అదే బీదవాడు ఇటీవల తన భార్యను తీసుకొని కట్టెలు కొట్టడానికి తిరిగి అడవికి వెళ్ళాడు. ప్రమాదవశాత్తు అతని భార్య నదిలో పడిపోయింది ...

అతను దీనంగా...
ఒడ్డున కూర్చోనుండగా ...
తిరిగి దేవుడు ప్రత్యక్షమై "ఏమైందని" అడుగగా...

"నా భార్య నదిలో పడిపోయింది" అనగా...

దేవుడు ఒక అందమైన అమ్మాయిని తెచ్చి, "ఈమేనా నీ భార్య?" అని అడుగుగా...

"అవును స్వామీ! ఈమే నా భార్య" అంటాడు.

ఆశ్చర్యపోయిన దేవుడు ...

"అప్పుడు నిజాయితీగా ఉండేవాడివి ...

ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యావు?" అని అడుగుగా...

"స్వామీ !  మీరు ఈ అమ్మాయిని చూపెట్టారు.  నేను నా భార్య కాదంటాను ...

తర్వాత మీరు ఇంకో ఇద్దరు ఇంకా అందమైన అమ్మాయిలని చూపెడతారు...
నేను వాళ్ళను కూడా కాదంటాను ...

అప్పుడు నా భార్యను  చూపెడతారు...

నేను అవునంటాను...

అప్పుడు మీరు అందరిని నాకు ఇచ్చి వెళతారు ...

అయ్యో స్వామీ! ఈ కాలంలో ఒక్కరితోనే చాలా కష్టంగా ఉంది ...

ఇంత మంది అయితే...!!
నావల్ల కాదు...!!!

అందుకే ..."                
😜😀😜😀😜😀😜😀😜