అనగనగా ఒకతనికి ఎడమ కాలు పచ్చ రంగు లోకి మారింది అతను గాబరా పడి డాక్టరు కి చూపించాడు.
డాక్టరు గారు "కాలు మొత్తం విషం తో నిండి పోయింది, ఆ విషం మొత్తం శరీరానికి పాకే అవకాశం ఉంది కనుక వెంటనే ఆపరేషన్ చేసి కాలు తీసేయాలి" అన్నారు.
అన్నట్టుగానే ఆపరేషన్ చేసి కొత్త కృత్రిమ కాలు అమర్చారు.
కొద్ది రోజుల తర్వాత అతని కుడి కాలు కూడా పచ్చ రంగు లోకి మారింది.
మళ్ళీ డాక్టరు దగ్గరికి వెళ్ళాడు. ఆయన "వెంటనే ఆపరేషన్ చేసి కుడి కాలు కూడా తీసేయాలి" అన్నారు.
కుడికాలు కూడా తీసేసి కృత్రిమ కాలు అమర్చారు..
మళ్ళీ కొద్ది రోజుల తర్వాత , కృత్రిమ కాళ్ళు రెండూ పచ్చ రంగు లోకి మారిపోయాయి.
ఇతను భయపడి వెంటనే డాక్టరు దగ్గరికి వెళ్ళాడు.
అప్పుడు డాక్టరు గారు బాగా పరిశీలించి,ఇలా అన్నారు.
.
.
.
.
.
.
...... నాకిప్పుడు అర్థమైంది మీ ప్రాబ్లం...
మీ లుంగీ.. రంగు వదులుతుంది..... ఏం గాభరా పడకండి.. నిశ్చింతగా ఉండండి..!

0 Comments