మొన్నామధ్య షా-గౌస్ రెస్టారెంట్లో కుక్క మాంసంతో బిర్యానీ చేసి అమ్ముతున్నారని వాట్సాప్ లో చూసి తెగ కంగారు పడిపోయాం కదా, ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే అది అంతా వట్టి అబద్దం అని.
చంద్రమోహన్ చారి అనే ప్రబుద్దుడు చేసిన పని ఇదంతా. అతనికి మన దేశంలో ఎక్కడో ఇలా కుక్క మాంసంతో బిర్యానీ చేస్తున్నారని మెసేజ్ వచ్చిందట. అతను తన స్నేహితులను ఊరికే భయపెడదాం అని అవి షా-గౌస్ రెస్టారెంట్లోవి అన్నట్టు పంపించాడంట. అంతే ఇంకేముంది ఆ షా-గౌస్ వాళ్ళ నోట్లో మట్టి పడింది.
ఆ మెసేజీలు ఒక్కసారిగా వైరల్ అయిపోయాయి. వాటికి తోడు మన TV ఛానల్ వాళ్ళు తందానా అని ఉన్నవి లేనివి కలిపి డప్పు కొట్టేసారు.
కాబట్టి ఫ్రెండ్స్ మనం అన్ని నమ్మకూడదు. కాస్త అలోచించి ఒక అడుగు వేయాలి. ఫార్వర్డ్ ఆప్షన్ ఉంది కదా అని 150 మందికి మెసేజ్ ఫార్వర్డ్ చేసేయకండి.
ఈ కింద వీడియోలో ఉన్న అతనే. మన యాప్ వాడే వారికి వీడియో సరిగా రాకపోతే ఈ కింది లింక్ ని క్లిక్ చేయండి.
https://www.facebook.com/mufakham.munsiftv/videos/1844297292514392/

0 Comments