పాత నోట్ల రద్దు వల్ల రోజు రోజుకి జనం పడుతున్న బాధలు పెరుగుతున్నాయి. ఈ కష్టాలు తీరాలంటే మనం డిజిటల్ చెల్లింపులు చెయ్యడం ఒక్కటే మార్గం.
ఈ డిజిటల్ చెల్లింపులు చేసేలా ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి ప్రభుత్వం పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కావు. కానీ ఏవీ సత్ఫలితాలు ఇవ్వలేదు.
కానీ మనకి ఉన్న ఏకైక మార్గం కాబట్టి మనం ఎంత త్వరగా డిజిటల్ వైపు అడుగులేస్తే అంత మంచిది.
ఇదిలా ఉంచితే ప్రజలని డిజిటల్ చెల్లింపులు చేసేలా ప్రోత్సహించడానికి ప్రభుత్వం రెండు కొత్త పధకాలు తీసుకుని వచ్చింది. అవి
1. లక్కీ గ్రాహక్ యోజన (Lucky Grahak Yojana)
2. డిజి ధన్ వ్యాపారి యోజన (Digi Dhan Vyapari Yojana)
ఈ రెండు పథకాల కింద డిజిటల్ చెల్లింపులు చేసిన ప్రజలకూ , డిజిటల్ చెల్లింపులు స్వీకరించే వ్యాపారులకూ బహుమతులు ఇస్తారు.
ఈ రెండు పతకాలను ప్రోత్సహించడానికి 340 కోట్లు కేటాయించారు . ఈ డబ్బుని 100 రోజుల్లో ఖర్చు చేయనున్నారు.
గ్రాహక్ యోజన కింద 100 రోజుల వరకు ప్రతి రోజు 15000 వేల మంది రూ.1000/- దాకా గెలుచుకోవచ్చు. అంతే కాదు ప్రతి వారం 7 మంది అదృష్టవంతులు ఒక లక్ష రూపాయలు గెలుచుకోవచ్చు.
7000 మంది వ్యాపారాలు కూడా 50000 గెలుచుకునే అవకాశం ఉంది.
అంతే కాకుండా 14.04.2017 రోజు జరిగే మెగా డ్రా లో ఒక కోటి రూపాయల వరకు గెలుచుకోవచ్చు. 25 లక్షలు , 50 లక్షల బహుమతులు కూడా ఉన్నాయి.
వ్యాపారాలు కూడా 50 లక్షల వరకు గెలిచే అవకాశం ఉంది.
కాబట్టి క్యాష్ లేదని బాధపడకండి. డిజిటల్ చెల్లింపులు చేయడం మొదలు పెట్టండి.
మీ ఆలోచనలు నాతో పంచుకోడానికి కింద కామెంట్ చేయండి.
మీ స్నేహితులకు షేర్ చేయడం మర్చిపోకండి.
ఇట్లు
మీ
Yetakaram Yenkatrao

0 Comments