నిన్న రాత్రి మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు 500/1000 నోట్లు ఇక చెల్లవు అని చెప్పినప్పటినుంచి దేశమంతా ఒకటే హైరానా పడిపోతున్నారు. జనం తమ దగ్గర ఉన్న డబ్బులు ఎలా మార్చుకోవాలి , బ్యాంకు వాళ్ళు ఇక తెగ ఇబ్బంది పెట్టేస్తారు అని చాలా ఫీల్ అవుతున్నారు .

ఇది ఇలా ఉండగా చాలా మంది విద్యా వేత్తలు, ఆర్ధిక వేత్తలు, సినిమా స్టార్లు ఇది చాలా గొప్ప అడుగు , మన దేశం దీని వల్ల ఎంతో ముందుకి వెళ్తుంది, పేదరికం పోతుంది అంటున్నారు. కాబట్టి ఇది ఒక అద్భుతమైన ఆలోచన అని అంటున్నారు.

ఇంతటి అద్భుతమైన ఆలోచన అసలు మోడీ గారికి ఎవరు ఇచ్చారు? ఈ ఆలోచన మోడీ గారికి ఇచ్చింది పూణే లో ఉండే అనిల్ బోకిల్. ఈయన పూణే లో ఉండే ఒక ఆర్ధిక శాస్త్రవేత్త. ఈయన మోడీ గారిని కలిసి మన దేశంలోని నల్ల డబ్బుని అంతా ఎలా మార్చాలో చెప్పారు.

మనకి ఉన్న సమాచారం ప్రకారం అనిల్ బోకిల్, కొన్ని నెలల ముందు మోడీ గారిని కలిసారు. తన ఐడియా ఏంటో చెప్పడానికి అనిల్ కి  కేవలం 9 నిముషాల సమయం మాత్రమే ముందు దొరికింది. కానీ ఆయన చెప్పింది నచ్చి మోడీ గారు తనతో 2 గంటల పాటు మాట్లాడుతూ ఉండిపోయారు.

దేశంలోని 78% జనం కేవలం రోజుకి 20 రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. అలాంటప్పుడు మనకి పెద్ద నోట్ల అవసరం లేదని చెప్పారు.

దేశం లో అన్ని లావాదేవీలు కేవలం బ్యాంకుల ద్వారానే జరగాలని, అప్పుడే నల్ల డబ్బుకి అడ్డు కట్ట వెయ్యగలమని చెప్పారు.

మోడీ గారు  అనిల్ చెప్పిన విషయాలను పెద్ద పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తలతో చర్చించి చివరకు నిన్న ఒక గొప్ప నిర్ణయం తీస్కున్నారు.

కాబట్టి మనం అందరం అనిల్ బోకిల్ ను అభినందిచాలి. తన గొప్ప ఆలోచనవల్ల దేశం మారబోతుంది. కాబట్టి అనిల్ గురించి అందరికి తెలిసేలా ఈ పోస్టుని షేర్ చేయండి.

మీ ఆలోచనలు అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి.