ఈ రోజుల్లో 70, 80 సంవత్సరాల వయసులో ఉన్న ముసలి వారికి ఉన్న ఓపిక 40, 50 సంవత్సరాల వయసులో ఉన్నవారికి లేదు. 40, 50 సంవత్సరాల వారితో పోలిస్తే పెళ్ళీడుకు వచ్చిన పిల్లలకు లేదు. పెళ్లీడు పిల్లలతో పోలిస్తే చిన్న వయసు పిల్లలు మరీ బలహీనంగా ఉంటున్నారు.


ఇలా రాను రాను చూస్తూ ఉంటే భవిష్యత్తులో తినే ఓపిక కూడా లేక తినిపెట్టు అనే రోజులు రాబోతున్నాయి. దీనికి కారణం బలం లేని ఆహారం తినడం రుచికి తింటున్నారే గాని బలానికి, ఆరోగ్యానికి కాదు. రోజుకి 15, 18 గంటలు పనిచేసినా ఓపిక తగ్గకూడదంటే.
చిట్కాలు:
  1. అన్నింటికంటే ఎక్కువ బలమైన ఆహారం కొబ్బరి. రోజుకి ఒక పచ్చి కొబ్బరికాయను పూర్తిగా ఉదయం పూట టిఫిన్ లాగా తింటే (మొలకెత్తిన వాటితో పాటు) మంచిది.
  2. ఖర్జూరం పండు చాలా ఎక్కువ శక్తిని తక్కువ టైములో అందించగలదు. రోజుకి 20 ఖర్జూరం పండ్లను ఉదయం కొబ్బరితోగాని సాయంకాలం పండ్లతో గాని కలిపి తింటే లాభం చాలా త్వరగా వస్తుంది.
  3. ముడిబియ్యం అన్నం వండుకుని రెండు పూటలా తింటే 10, 15 రోజులలోనే ఓపిక పెరుగుతుంది. ఈ మూడు విషయాలు ఆచరిస్తే ఒక నెలలోనే పూర్తిగా ఓపికను, బలాన్ని సంపాదించుకోవచ్చు.
  4. ఎప్పుడన్నా ఉన్నట్లుండి నీరసం వచ్చి కళ్ళు తిరిగితే అలాంటప్పుడు వెంటనే శక్తి కొరకు తేనెను 3, 4 స్పూన్లు తీసుకుని మెల్ల మెల్లగా నాకుతుంటే, 5, 10 నిమిషాలలోనే ఓపిక వచ్చేస్తుంది.
ఈ ఉపయోగకరమైన విషయాన్ని మీ ఆత్మీయులకి షేర్ చెయ్యండి.