నల్లశోభి, తెల్లశోభి అని రెండు రకాలుగా వచ్చి చర్మ అందాన్ని పాడు చేస్తాయి. ముఖ్యముగా చెమటలు బాగా పట్టి నిల్వ ఉండే చోట, ఆ చెమట వల్ల ఫంగస్ అనే క్రిములు చేరి అక్కడ ఇన్ ఫెక్షన్ కలిగి చర్మం మచ్చలు మచ్చలుగా మారుతుంది. సరిగా స్నానం చేయని వారికి వస్తుంది.
చిట్కాలు:
- లేత వేప ఆకులను నూరి ఆ మచ్చలున్న భాగంపై రుద్ది స్నానం చేస్తే మంచిది.
- అప్పుడప్పుడూ తేనె, నిమ్మరసం ఈ రెండూ కలిపి చర్మానికి రాసి బాగా ఇంకనిచ్చి స్నానం చేయవచ్చు. లేదా వట్టి నిమ్మరసం రాసైనా చేయవచ్చు.
- పైన చెప్పినట్లుగా స్నానం చేస్తే చర్మం పూర్తిగా శుభ్రం అయ్యి ఏ క్రిములు చేరే అవకాశముండదు. ఇలా చేస్తే 20, 25 రోజులలో తగ్గుతుంది.
- ఆహారంగా రసాలను ఎక్కువగా త్రాగితే చర్మానికి మంచిది.

0 Comments