జీర్ణ క్రియలో దోషాల వలన ఎక్కువగా వికారం వస్తుంది. నిద్ర లేచిన వెంటనే ప్రేగులలో పసర్లు ఎక్కువగా వున్నా తిన్నది సరిగా అరగక పోయినా, ఆహారం తిని బస్సు, కారు లాంటివి ఎక్కినా, ఆహారంలో సరిపడని విషపదార్థాలున్నా వికారాలు వస్తూ వుంటాయి.
వికారం వున్నప్పుడు వాంతి అయితే బాగుంటుందనిపిస్తుంది. ఈ లోపు కళ్ళు కూడా తిరుగుతూ కుదురు లేనట్లుగా వుంటుంది. వాంతి వచ్చినట్లుంటుంది కాని వాంతి రాదు. వాంతి అయితే బాగుంటుందని అందరికీ అనిపించినా వాంతి చేసుకోవాలనే ఆలోచన పట్టదు. వికారం ముదిరితే కాని వాంతి అవదు. వాంతి అయితే కాని తిక్క తగ్గదు.
చిట్కాలు:
అవకాశం వుంటే గోరువెచ్చని నీరు, లేనప్పుడు బిందెలో నీరు 5, 6 గ్లాసులు (ఉప్పు కలపకుండా) ఆపకుండా త్రాగండి. ఇంకా త్రాగ గలిగితే త్రాగండి. నీరు త్రాగుతుంటే వికారం ముదరాలి. త్రాగేటప్పుడే వాంతి వచ్చేటట్లుగా త్రాగండి. త్రాగలేనప్పుడు ఆపి వ్రేళ్ళను నోటిలో పెట్టి వాంతి చేసుకోండి. మనము త్రాగిన నీళ్ళు వెళ్ళి లోపల వున్న దోషాన్ని పట్టుకొని బయటకు వచ్చేస్తాయి. పొట్టలో ఆహారం వున్నా సరే ఎప్పుడు వికారంగా వుంటే అప్పుడు ఇలా వాంతి చేసుకోవచ్చు. వెంటనే ఏమి తినకుండా కాసేపు విశ్రాంతి తీసుకొని తేనె నిమ్మరసం కాని కొబ్బరి నీళ్ళు కాని త్రాగితే హాయిగా వుంటుంది.
ఈ ఉపయోగకరమైన విషయాన్ని మీ ఆత్మీయులకి షేర్ చెయ్యండి.

0 Comments