ఇది దేశంలోనే అతి పొడవైన రైల్‌ రోడ్‌ బ్రిడ్జి. దీన్ని ప్రధాని మోడీ ఈ నెల 25న ప్రారంభించబోతున్నారు. 

అసోంలోని టిన్సుకియా నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌లోని నహర్లాగన్‌ పట్టణానికి రైలు మార్గం ద్వారా చేరుకోవాలంటే 15 గంటల 20 నిమిషాలు పడుతుంది.
  

బోగిబీల్‌ బ్రిడ్జీని కట్టడంతో ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం దాదాపు 10 గంటలు తగ్గుతుంది. 

ఈ బ్రిడ్జి ని 1997లో అప్పటి ప్రధాని HD దేవే గౌడ ప్రారంభించారు. కానీ పనులు మాత్రం 2002లో అటల్ బిహారి వాజ్పాయ్ మొదలు పెట్టారు.
  
బ్రహ్మపుత్ర నదిపై దాదాపు 4.9 కిలోమీటర్ల వరకు బ్రిడ్జిని నిర్మించారు. దీన్ని పూర్తిగా వెల్డింగ్ చేసి కట్టారు. యూరోపియన్ కోడ్స్ మరియు వెల్డింగ్ స్టాండర్డ్స్ ఆధారంగా ఈ బ్రిడ్జి ని నిర్మించారు.
  
దాదాపు 5900 కోట్ల వ్యయం దీన్ని కట్టడానికి అయ్యింది. 120 ఏళ్ల వరకు ఉంటుంది.


ఇందులోని కింది అంతస్తులో రెండు లైన్ ల పట్టాలు, పై అంతస్తులో మూడు లైన్ల రోడ్డు మార్గం నిర్మించారు.

విశ్లేషకుల అంచనా ప్రకారం ప్రతీ రోజు 10లక్షల రూపాయల ఇంధనం ఆదా అవ్వగలదు.
  
ఈ బ్రిడ్జి ద్వారా మొదటి సారిగా పాసింజర్‌ ట్రైన్‌ ప్రయాణించనుంది.
  
ఈ నెల 25న అటల్‌ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రధాని మోడీ బ్రిడ్జినుంచి రాకపోకలు ప్రారంభిస్తారు.